రైలు ప్రయాణంలో నూతన అధ్యాయం ప్రారంభం కానుంది.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.. వందే భారత్ స్లీపర్ రైలు అధునాతన సాంకేతికత, సౌకర్యాల మేళవింపుతో రైలు ప్రయాణానికి సరి కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఈ రైలు జతను ఫంక్షనల్ ఎక్సలెన్స్‌తో సౌందర్య ఆకర్షణను మిళితం చేసేలా సూక్ష్మంగా రూపొందించారు. రైలులో ఉపయోగించిన అన్ని పదార్థాలు, భాగాలు అత్యధిక అగ్నినిరోధక భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటాయి. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, ఉన్నతమైన ఇంటీరియర్స్‌తో రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు భారతదేశం రైలు సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. ఇది యూరోపియన్ స్థాయి ప్రమాణాలతో సమానంగా ప్రయాణీకులకు అనుభవాన్ని అందిస్తుంది. భారతదేశంలో సుదూర రైలు ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి అనుగుణంగా రూపొందించారు. ఈ విభాగంలో సౌకర్యం, భద్రత, సామర్థ్యం కోసం నూతన ప్రమాణాలను నెలకొల్పారు.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రపంచ స్థాయి ఫీచర్లను కలిగి ఉంది.
🚄 Train journey redefined with comfort, safety and innovation.✨
Vande Bharat Sleeper Express, features we must know!🧵👇🏻 pic.twitter.com/zXgusgLKLi
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2024
* ఆస్టెనిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ రైలు
* ప్రయాణీకుల భద్రత కోసం రైలు జత లో విలువైన ఫీచర్‌లు
* జి. ఎఫ్. ఆర్ . పి ప్యానెల్‌లతో కూడిన ఉత్తమ-తరగతికి చెందిన ఇంటీరియర్స్
* ఏరోడైనమిక్ బాహ్య రూపాలు
* మాడ్యులర్ పాంట్రీ
* ఈ. ఎన్.45545 ప్రకారం అగ్ని భద్రత, ప్రమాదాలను నిరోధించే సదుపాయం..
* దివ్యాంగులకు అనుకూలమైన ప్రత్యేక బెర్త్‌లు- టాయిలెట్లు
* ఆటోమేటిక్ బాహ్య ప్రయాణీకుల తలుపులు
* సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ తలుపులు
* ఎండ్ వాల్ వద్ద రిమోట్‌గా పనిచేసే ఫైర్ బారియర్ డోర్లు
* సమర్థతాపరంగా రూపొందించబడిన వాసన లేని టాయిలెట్ వ్యవస్థ
* డ్రైవింగ్ సిబ్బంది కోసం టాయిలెట్
🚨 India’s first Vande Bharat prototype sleeper train unveiled in Bengaluru.
First look of the VB sleeper version. (📷-@ChristinMP_) pic.twitter.com/0dcItXHwKy
— Indian Tech & Infra (@IndianTechGuide) September 1, 2024
• ఏ. సి ప్రథమ చైర్ కార్ లో షవర్ తో వేడి నీటి సదుపాయం.
• యూ ఎస్ బి ఛార్జింగ్ సదుపాయంతో ఇంటిగ్రేటెడ్ రీడింగ్ లైట్
• పబ్లిక్ ప్రకటన – దృశ్య సమాచార వ్యవస్థ
• ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలు
• విశాలమైన సామాను గది
సేవ సమయంలో గరిష్ట వేగం -160 కి.మీ
పరీక్ష సమయంలో గరిష్ట వేగం- 180 కి.మీ
మూడు రకాల బెర్త్ లు ఉండనున్నాయి.. ఏ. సి 3 టైర్ బెర్త్‌లతో పాటు.. ఫస్ట్ క్లాస్ ఏ. సి బెర్త్ ఉండనుంది.. మొత్తం 823 మంది ప్రయాణించేలా 16 బెర్త్ లు ఉండనున్నాయి..
భారత్ ఎర్త్ మువర్స్ లిమిటెడ్, బెంగళూరులో జరిగిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో కేంద్ర రైల్వే, సమాచార-ప్రసార, ఐటీ-ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర రైల్వే, జలశక్తి శాఖల సహాయ మంత్రి వి సొమ్మన్న వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలును పరిచయం చేశారు.
Best in the world बनना है!
🚄Vande Bharat Sleeper!
📍BEML in Bengaluru, Karnataka. pic.twitter.com/76bf1i9t2S— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 1, 2024