త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో సిబ్బంది కొత్త యూనిఫాంలు ధరించనున్నారు. అయితే ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. యునిఫాంపై కమలం పువ్వు గర్తు ఉండటంతో.. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక 18వ తేదిన పార్లమెంట్ పాత భవనంలోనే ఈ సమావేశాలను ప్రారంభించనున్నారు. అయితే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని 19వ తేది నుంచి ఈ సమావేశాలను కొత్త భవనంలోకి మార్చనున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త పార్లమెంటు భవనంలోకి వెళ్లే సమయంలో సిబ్బంది నూతన యూనిఫాం ధరించి వెళ్తారని సమాచారం.
అయితే ఈ కొత్త యూనిఫాంను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రత్యేకంగా రూపొందించింది. అయితే ఇవి ఊదా ఎరుపు రంగు లేదా.. గులాబీ రంగులో ఉంటాయి. వారి చొక్కాల పువ్వుల డిజైన్‌తో ముదురు గులాబీ రంగులో ఉంటాయి. అలాగే ప్యాంట్లు ఖాకీ రంగులో ఉంటాయని తెలుస్తోంది. అలాగే పార్లమెంట్ భవనంలో ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి సపారీ సూట్లకు బదులుగా మిలటరీ తరహా డిజైన్ ఉంటుందని సమాచారం. అయితే పార్లమెంట్ సిబ్బంది యూనిఫాంపై జాతీయ పుష్పం కమలం బొమ్మ ముద్రిస్తున్నారని తెలియడంతో దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మానికం ఠాగూర్ కూడా ట్విట్టర్ వేదికపై తన స్పందన తెలియజేశారు. ఎందుకు కమలం బొమ్మను కొత్తగా ముద్రించారంటూ ప్రశ్నించారు. జాతీయ జంతువు పలి, జాతీయ పక్షి నెమలిలను ఎందుకు ముంద్రించలేందంటూ అడిగారు.
బీజేపీ ఎన్నికల గుర్తు కమలం పువ్వు కాబట్టే.. ఈ డిజైన్ ఎంచుకున్నారని ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కాషాయికరణ, ఎజెండా లాంటి రాజకీయాలు చేస్తోందని ఆర్జేడీ నేత మనోజ్ ఝూ విమర్శించారు. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఇండియా సమన్వయ కమిటీ భేటీ బుధవారం రోజున జరగనుంది. సీట్ల పంపిణీతో సహా.. ప్రచార వ్యూహంపై ఇందులో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఢిల్లీలోని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరగనున్న ఈ భేటీకి ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో 14 మంది సభ్యులు పాల్గొననుట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల కర్ణాటలో జరిగిన ఎన్నికల్లో పార్టీ మెరుగైన ఫలితాలు దక్కించుకుందనే విషయమే.. సీట్ల పంపిణీకి ప్రాతిపదిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మహారాష్ట్ర, తమిళనాడు, బిహర్ రాష్ట్రాల్లో సీట్ల పంపిణీపై అవగాహన వచ్చినట్లేనని.. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు కమిటీకి సవాలుగా ఉన్నట్లు సమాచారం.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..