Presidential Elections 2022: తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి యోగాతో మొదలు.. ద్రౌపది ముర్ము గురించి..

|

Jul 22, 2022 | 2:33 PM

జీవన ప్రయాణంలో క్రమశిక్షణ, ధ్యానం, సమయం వీటికి అధిక ప్రధాన్యత ఇస్తుంటారు. వీటితోపాటు ద్రౌపదీ ముర్ముకు సంబంధించిన మరిన్ని విశేషాలు..

Presidential Elections 2022: తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి యోగాతో మొదలు.. ద్రౌపది ముర్ము గురించి..
Droupadi Murmu
Follow us on

రాష్ట్రపతి భవన్‌లోకి తొలిసారి గిరిజన మహిళ అడుగుపెట్టబోతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థిగా పోటీ చేసిన ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. ఊహించినట్లుగానే ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ ఆధిక్యం సంపాదించారు. క్రాస్​ ఓటింగ్​ జోరుగా జరగడంతో.. ఊహించిన దానికంటే అధిక మెజార్టీ వచ్చింది. ఈ విజయంతో ముర్ము.. రాష్ట్రపతి పీఠమెక్కే తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. 64 ఏళ్ల ద్రౌపదికి.. ఒడిశా మంత్రిగా, ఝార్ఖండ్​ గవర్నర్​గా సేవలు అందించిన అనుభవం ఉంది. ముర్ము ఈనెల 25న రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీనికి ముందు, ద్రౌపది ముర్ము ప్రయాణం, ఆమె జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుందాం. గిరిజన కుటుంబం నుంచి వచ్చి దేశానికి కొత్త రాష్ట్రపతి అత్యున్నత పదవికి చేరుకోవడం అంత సులువు కాదు. ఆమె జీవితం కూడా చాలా కష్టాలతో నుంచి మొదలైంది. కానీ ఆమె జీవన ప్రయాణంలో క్రమశిక్షణ, ధ్యానం, సమయం వీటికి అధిక ప్రధాన్యత ఇస్తుంటారు. వీటితోపాటు ద్రౌపదీ ముర్ముకు సంబంధించిన మరిన్ని విశేషాలు..

ద్రౌపది ముర్ము చాలా క్రమశిక్షణతో అత్యంత సామాన్యమైన జీవన శైలిని అనుసరిస్తుంటారు. ద్రౌపది ముర్ము రోజువారి దినచర్యలో భాగంగా.. ప్రతిరోజూ తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొంటారు. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేస్తుంటారు. ఆ తర్వాత అల్పాహారం చేసి, ఆపై వార్తాపత్రికలు చదవడం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువడం చేస్తుంటారు. సమయపాలనకు అధిక ప్రధాన్యత ఇస్తుంటారు. ఆమె శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. ఒడిశాలోని ప్రత్యేకమైన స్వీట్ “చెన్నా పోడా” అంటే(Chhena Poda) చాలా ఇష్టం.

1996 నుంచి ద్రౌపది ముర్ముతో కలిసి ఉన్న వికాస్ మహోంటో ఈ వివరాలను మరిన్ని వెల్లడించారు. “ఆమె అనూహ్యంగా కష్టపడి పని చేస్తుంటారు. ప్రతి విషయంలోనూ సమయపాలన పాటించేవారు. ఉదయం 3 గంటలకు నిద్రలేచిన తర్వాత, ఆమె యోగా, ధ్యానం చేస్తుంటారు. తర్వాత ఆమె అల్పాహారం చేసి, ఆపై వార్తాపత్రికలు, కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతుంటారు.

జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు

పార్లమెంటరీ సమావేశం అనంతరం ఆమె రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించినట్లు చెప్పడంతో మొదటి కొన్ని సెకన్ల పాటు ఆమె చాలా భావోద్వేగానికి లోనయ్యారు. 2009- 2015 మధ్య కేవలం ఆరేళ్లలో ముర్ము తన భర్తను కోల్పోయారు. ఇద్దరు కుమారులు, తల్లి, సోదరుడు ఇలా వరుసగ ఆమె జీవితం నుంచి వెళ్లిపోయారు. అయినా తాను మాత్రం ప్రజలతో మరింత అనుబంధాన్ని పెంచుకున్నారు.

జాతీయ వార్తల కోసం..