New PF Rules 2021 :ఉద్యోగులకు పీఎఫ్ పై కేంద్ర ప్రభుత్వం మరో షాక్.. త్వరలో వడ్డీపై కూడా పన్ను చెల్లించాల్సిందే..

మోడీ ప్రభుత్వం పిఎఫ్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. పిఎఫ్ అకౌంట్ కు వచ్చే వడ్డీపై ఇక నుంచి టాక్స్ కట్టాల్సి ఉంది. ఈ నిబంధన వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది...

New PF Rules 2021 :ఉద్యోగులకు పీఎఫ్ పై కేంద్ర ప్రభుత్వం మరో షాక్.. త్వరలో వడ్డీపై కూడా పన్ను చెల్లించాల్సిందే..
Follow us

|

Updated on: Mar 03, 2021 | 1:43 PM

New PF Rules 2021 : మోడీ ప్రభుత్వం పిఎఫ్ ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. పిఎఫ్ అకౌంట్ కు వచ్చే వడ్డీపై ఇక నుంచి టాక్స్ కట్టాల్సి ఉంది. ఈ నిబంధన వచ్చే నెల నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటి పీఎఫ్ అమౌంట్ ద్వారా లభించే వడ్డీపై ఎలాంటి పన్ను లేదు.

2021- 22 ఆర్ధిక బడ్జెట్ లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన ప్రకారం ఇక నుంచి మీ ఆదాయంపైనే కాదు..పొదుపుపై కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ న్యూ పీఎఫ్ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అప్పటి నుంచి మీ నెలసరి జీతంపైనే కాకుండా జీతంలో ప్రతి నెలా కట్ అయ్యే పీఎఫ్‌పై కూడా ఇక పన్ను కట్టాల్సిందే. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్ధిక బడ్జెట్ సమర్పించే సమయంలో ప్రోవిడెంట్ ఫండ్‌పై కీలక ప్రకటన చేశారు.

దీంతో ఏప్రిల్ 1 నుంచి ఏటా ప్రోవిడెంట్ ఫండ్ 2.5 లక్షలకు జమ అయితే ఆ నగదుపై లభించే వడ్డీపై ఇక నుంచి ఇన్‌కంటాక్స్ కట్టాల్సిందే. అయితే ఏడాదికి రూ. 2.5 లక్షలలోపు డిపాజిటయ్యే మొత్తంపై వడ్డీకు ఎలాంటి పన్ను అవసరం లేదు.

అంటే ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతా లో ఎంప్లాయి మూల వేతనం నుంచి 12 శాతం జమ అయితే.. అదే మొత్తాన్ని కలిపి ఆ మొత్తాన్ని కంపెనీ ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. అయితే ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ఈ నిర్ణయంతో ఇక నుంచి పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదు జమ అయ్యేవారికి ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఏడాదికి రూ. 20. 83 లక్షలకు పైన సంపాదించే వారు ఇక నుంచి పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నగదు పై పన్ను కట్టాల్సి ఉంది. ఈ కొత్త నిబంధన ఉద్యోగి వాటాకు మాత్రమే వర్తిస్తుంది. అయితే ఆ పన్ను ఎంత విధిస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు ఖరారు కాలేదింకా. అంటే ఇక శాలరీపైనే కాకుండా పీఎఫ్ కాంట్రిబ్యూషన్‌పై కూడా పన్ను చెల్లించాలన్న మాట.

Also Read:

South India Famous Temples : దక్షిణ భారతదేశంలోని అందమైన ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు వాటి.. విశిష్టత