వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ తమ ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ మళ్ళీ స్పష్టం చేశారు. నందిగ్రామ్ లో మాట్లాడిన ఆయన..ఇక పార్లమెంటులో కొత్త మండీని ఏర్పాటు చేస్తామని, తిరిగి ఢిల్లీలో ట్రాక్టర్లు ప్రవేశిస్తాయని చెప్పారు. కనీస మద్దతు ధరతో పంటలను విక్రయించడం జరుగుతుందని, ఈ శ్రీ లక్ష్యం పార్లమెంటు వద్ద ఆహార ధాన్యాలను అమ్ముకోవడమేనని చెప్పారు. 25 లక్షల మంది రైతులు 3.5 లక్షల ట్రాక్టర్లతో ఢిల్లీ నగరంలో ప్రవేశిస్తారని ఆయన చెప్పారు. పార్లమెంటులో మండీ ఏర్పాటు అన్నది ఉత్తమమమని నేను భావిస్తున్నా.. రైతు బయటే ఉంటాడు..ట్రేడర్ కూడా బయటే ఉంటాడు..అమ్మకాలు చక్కగా ..తప్పకుండా జరుగుతాయి అని ఆయన అన్నారు.కేంద్రం అన్నదాతల ప్రయోజనాలను కాలరాస్తోందని, బడా కార్పొరేట్ల కోసమే పని చేస్తోందని తికాయత్ ఆరోపించారు.
నందిగ్రామ్ లో బీజేపీకి ఓటు వేయరాదని ఆయన ఓటర్లను కోరారు. మీ కోసం, మీ ప్రయోజనాలకోసం పని చేసే అభ్యర్థికే ఓటు వేయండి అన్నారు. ఇక్కడ సీఎం మమతా బెనర్జీకి, బీజేపీ అభ్యర్థికి మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోందని, మమతను గాయపరిచేందుకు బీజేపీ కుట్ర పన్నిందని రాకేష్ తికాయత్ ఆరోపించారు. కేంద్రంలోని ప్రభుత్వం బడా కంపెనీల కోసం పని చేస్తోంది.. ఏ ఆజకీయ పార్టీ కూడా కాదు అని ఆయన అంతకు ముందు ఢిల్లీలో వ్యాఖ్యానించారు.. అసలు కేంద్ర ప్రభుత్వ మంతా కోల్ కతా వెళ్లిందని ఆయన సెటైర్ వేశారు. బెంగాల్ ఎన్నికల కోసం మంత్రులు, అధికార బృందమంతా పొలోమంటూ అక్కడికి వెళ్లారన్నారు. ఒక రాష్ట్ర ఎన్నికల కోసం ఇంత హంగామా అవసరమా అన్నరీతిలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఉండగా ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో తిక్రి వద్ద రైతులు తాత్కాలిక ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. ఇటుకలు, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రితో రోజూ దాదాపు పక్కా ఇళ్ళు కడుతున్నారు. ఈ నిర్మాణాలు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేం అని రైతు నేతలు చెబుతున్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ : సింహం ప్రాంక్ వీడియో వైరల్.. నిజం తెలిసి నవ్వులే నవ్వులు..! Viral Video
సింహాల పక్కన కూర్చొని.. గిటార్ వాయిస్తే.. ఆ కిక్కే వేరబ్బా..వైరల్ గా మారిన వీడియో :Viral Video