New Labour Laws: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పెరగనున్న వేతనాలు.. వారానికి రెండు వీకాఫ్‌లు..

|

Jun 25, 2022 | 5:53 AM

కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు, పీఎఫ్‌తో పాటు పనిగంటలు సహా ఇతర అంశాల్లో మార్పులు రానున్నాయి. పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి నాలుగు కొత్త కార్మిక చట్టాలను తెస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం వెల్లడించింది.

New Labour Laws: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో పెరగనున్న వేతనాలు.. వారానికి రెండు వీకాఫ్‌లు..
New Labour Laws
Follow us on

New Labour Laws: దేశవ్యాప్తంగా కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. జూలై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక చేస్తోంది. అయితే.. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే కార్మికుల వేతనాలు, పీఎఫ్‌తో పాటు పనిగంటలు సహా ఇతర అంశాల్లో మార్పులు రానున్నాయి. పెట్టుబడులను, ఉద్యోగ అవకాశాలను పెంచడానికి నాలుగు కొత్త కార్మిక చట్టాలను తెస్తున్నట్టు ఇప్పటికే కేంద్రం వెల్లడించింది. వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు తదితర అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు ఈ చట్టాల ద్వారా సాధించాలని భావిస్తోంది కేంద్రం. కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే, అధికారిక పనిగంటలు పెరుగుతాయి. ప్రస్తుతమున్న 8-9 గంటలకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఓటీ సమయం 50 నుంచి 150 గంటలకు పెరుగుతుంది. పీఎఫ్‌లో కార్మికుడు, యజమాని జమచేసే వాటా కూడా పెరుగుతుంది. గ్రాస్ వేతనంలో 50 శాతం బేసిక్‌ ఉండాలి. దానివల్ల పీఎఫ్‌కి కార్మికుడు జమచేసే మొత్తం పెరుగుతుంది. యజమాని కూడా అంతే స్థాయిలో జమ చేయాల్సి ఉంటుంది.

తద్వారా రిటర్మెంట్ తర్వాత అందుకునే మొత్తం, గ్రాట్యుటీ పెరుగుతాయి. దీని వల్ల పదవీవిరమణ తర్వాత ఉద్యోగులకు ఇబ్బందిలేకుండా జీవించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే చాలా ప్రైవేట్‌ కంపెనీలు వారానికి రెండు రోజుల వీకాఫ్‌ను అమలు చేస్తున్నాయి. కానీ, కొన్ని సంస్థలు అమలు చేయట్లేదు. ఈ చట్టాలు అమల్లోకి వస్తే, అన్ని కంపెనీలు కార్మికులకు వారానికి రెండు, నుంచి మూడు రోజులు వీకాఫ్‌ కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వేతన కోడ్ ప్రకారం.. ఉద్యోగి వారానికి మొత్తం 48 గంటలు పనిచేయడం తప్పనిసరి. దీని ప్రకారం.. పని గంటలను ఆయా కంపెనీలు నిర్ణయించుకోనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..