New Delhi Station Stampede: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరగడానికి కారణం ఇదే.. ఆర్‌పీఎఫ్‌ నివేదిక

|

Feb 18, 2025 | 10:38 AM

New Delhi Station Stampede: శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. తీవ్రగాయాల పాలైన 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా..

New Delhi Station Stampede: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరగడానికి కారణం ఇదే.. ఆర్‌పీఎఫ్‌ నివేదిక
Follow us on

New Delhi Station Stampede: ఫిబ్రవరి 15 రాత్రి 9:55 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో మహా కుంభ్ కు రైలు ఎక్కేందుకు ప్రయాణికులలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రమాదం వివరాలను పరిశోధించడానికి, రైల్వే మంత్రిత్వ శాఖ ఇద్దరు సీనియర్ రైల్వే అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.ఇది మొత్తం ప్రమాదం వివరాలను పరిశీలిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం, ఎలాంటి పొరపాట్లు జరిగాయో పరిశీలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ తొక్కిసలాటపై RPF (Railway Protection Force) నివేదిక ఇచ్చింది. ప్లాట్‌ఫామ్‌ మార్చడమే తొక్కిసలాటకు కారణం ఆర్‌పీఎఫ్‌ స్పష్టం చేసింది. 12వ నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుంచి శివగంగ ఎక్స్‌ప్రెస్‌ వెళ్లగానే.. అక్కడికి ప్రయాణికులు పోటెత్తారని తెలిపింది.12, 13, 14, 15,16 ప్లాట్‌ఫామ్‌లు రద్దీగా మారాయి. గంటకు 1500 టికెట్ల విక్రయాన్ని ఆపాలని కోరినట్లు ఆర్‌పీఎఫ్‌ తెలిపింది. స్పెయిల్‌ ట్రెయిన్‌ 12వ ప్లాట్‌ఫామ్‌కు వస్తుందని చెప్పారు..మళ్లీ 16వ నెంబర్‌కు వస్తుందంటూ ప్రకటన చేశారని తన నివేదికలో తెలిపింది. 2,3 నెంబర్‌ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలపైకి వెళ్లడానికి..ప్రయాణికులు మెట్లు ఎక్కుతుండగా తొక్కిసలాట జరిగినట్లు పేర్కొంది.

శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది చనిపోయారు. తీవ్రగాయాల పాలైన 18 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా వేయడంలో రైల్వేశాఖ అధికారులు ఘోరంగా విఫలమైనట్టు విమర్శలు వస్తున్నాయి. రైళ్ల రాకపోకలపై తప్పుడు అనౌన్స్‌మెంట్‌ తొక్కిసలాటకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చివరి నిముషంలో ప్లాట్‌ఫామ్‌ మార్చడంతో ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.

అంతేకాకుండా ఒకే పేరుతో రెండు రైళ్లు ఉండడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వాళ్లను కంట్రోల్‌ చేయడంలో RPF సిబ్బంది విఫలమయ్యారు. వాస్తవానికి ఎక్కువమంది RPF సిబ్బందిని కుంభమేళాకు తరలించడంతో చాలా తక్కువమంది సిబ్బంది ఢిల్లీ స్టేషన్‌లో ఉన్నారు. తొక్కిసలాటపై ఇద్దరు సభ్యుల విచారణ కమిటీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. తాజాగా ఆర్‌పీఎఫ్‌ నివేదికను సమర్పించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి