Neelakurinji Flowers Bloom: ప్రకృతి ప్రేమికుల 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. కేరళ(Kerala)లో మున్నార్ కొండలు నీలిరంగు పుల తివాచీ పరచుకున్నాయి. దక్షిణాదిన పశ్చిమ కనుమల్లో షోల అడవుల్లో నీలకురింజి పువ్వులు(Neelakurinji Flowers) ఈ ఏడాది విరబుశాయి. ఇడుక్కిలోని శలోం కొండలుల్లో నీలకురింజి పువ్వులు కనులకు విందు చేస్తున్నాయి. కేరళతో పాటు తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతాల్లో పశ్చిమ కనుమలలోని షోలా అడవులలోపూస్తాయి. ముఖ్యంగా నీలగిరి కొండలపై నీలకురింజి పొదలు దర్శనమిస్తాయి. ఈ కొండలకు నీలరిగి అనే పేరు ఈ మొక్కల వల్లనే వచ్చినట్లు స్థానికుల కథనం.
పన్నెండుఏళ్లకు పూసే ఈ పువ్వులు రూపంలోనే కాదు.. గుణం కూడా తనదైన స్పెషాలిటీని కలిగి ఉన్నాయి. వాన చినుకు పడితే చెట్లు పులకరిస్తాయి.. ఆకులు చిగురుస్తాయి. పుష్పాలు వికసిస్తాయి. అందంలోను వాసనలోనూ ఒకొక్క పువ్వుది ఒకొక్క ప్రత్యెక ఉంటుంది. అరుదైన ఈ పువ్వులు కేరళలో కూడా కొన్ని ప్రాంతాలలోనే దర్శనమిస్తాయి. అందమైన, అద్భుతమైన, అరుదైన పువ్వు “నీలకురింజి” పువ్వు పేరుతో కూడా ఒక దేవాలయం ఉంది.
నీలకురింజి ప్రత్యేకత:
దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో షోల అడవుల్లో మాత్రమే కనిపించే నీలకురంజి.. ఇది ఒక గుబురు పొదకు చెందిన చిన్న మొక్క. పువ్వులు నీలి రంగులో ఉంటాయి కనుక ఈ మొక్కను నీలకురింజి అని పిలుస్తారు. ఈ పువ్వుల అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పువ్వులను చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. అంత అందం వీటి సొంతం. అందుకనే ప్రకృతి ప్రేమికులు ఈ పువ్వులు వికసించే సమయం కోసం 12 ఏళ్ళు ఎదురుచూస్తారు. ప్రకృతి ప్రేమికుల ఎదురు చూపులకు చెక్ చెబుతూ ఈ ఏడాది శలోం కొండలలో 10ఎకరాలకుపైగా ప్రాంతంలో నీలకురింజి పువ్వులు విరబూశాయి. అయితే ఈ ఏడాది ఈ పువ్వులు విరబుసే సమయంలో కరోనా నేపధ్యంలో పర్యాటకులకు అనుమతినివ్వడం లేదు.
ఈ పువ్వులు పూసే సమయంలో ఈ మొక్కలు ఉండే కొండ చూడడానికి నీలాకాశం కిందకు దిగి వచ్చిందా అన్న ఫీలింగ్ ను కలిగిస్తుంది. ప్రకృతిలోని అందం మొత్తం అక్కడే కొలువు తీరిందా? అన్నట్లుగా ఉంటుంది. పశ్చిమ కనుమల్లో ఎక్కువగా కనిపించే ఈ మొక్కలు తూర్పు కనుమల్లో మాత్రం అక్కడక్కడా కనిపిస్తాయి.
హిల్ స్టేషన్ లో కురింజు దేవాయలం..
తమిళనాడులోని ఫేమస్ హిల్ స్టేషన్ కొడైకెనాల్ లో కురింజి పువ్వు పేరుతో దేవాలయం ఉంది. కొడైకెనాల్ సరస్సుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని కురింజి అండవర్ దేవాలయమని పిలుస్తారు. శ్రీ కురింజి ఈశ్వరన్ అని పేరుతో మురుగన్ పూజలు అందుకుంటారు. కురింజి అంటే పర్వతం…అండవర్ అంటే దేవత లేదా దేవుడు అని అర్థం. కురింజి అండవార్ అంటే పర్వత దేవుడు అని
శివ పార్వతుల తనయుడు కార్తికేయుడు కైలాసం నుంచి భూమి మీదకు వచ్చినప్పుడు మొదటి సారి ఈ పర్వతం మీదనే అడుగు పెట్టినల్టు పురాణాల కథనం. తన భర్త కుమారస్వామికి భార్య వల్లి ఈ నీలకురంజి పువ్వులతో మాలను చేసి.. భర్త మేడలో దండ వేసి స్వాగతం పలికిందని పురాణాల కథనం. ఇప్పటికీ ఈ దేవాలయంలో 12 ఏళ్లకు ఒకసారి పూసే పువ్వులతో పూజను చేస్తారట.