వరదలతో వణుకుతోన్న ఈశాన్య రాష్ట్రాలు : 150 మంది మృతి

ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. 70 లక్షల మందిపై ఈ వరద ప్రభావం పడింది. బ్రహ్మపుత్ర, జింజిరామ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. నదీతీర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వరదలతో మిజోరాంలో ఐదుగురు మృతి చెందారు. అలాగే.. మహారాష్ట్ర, బీహార్‌లోనూ వరద ప్రభావం కొనసాగుతోంది. బీహార్‌లో వరద ఉధృతికి 24 మంది మృతి చెందారు. అస్సోంలో వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి అస్సోం అతలాకుతలం అవుతోంది. దాదాపు 30 జిల్లాల్లో […]

వరదలతో వణుకుతోన్న ఈశాన్య రాష్ట్రాలు : 150 మంది మృతి

Edited By:

Updated on: Jul 17, 2019 | 10:18 AM

ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వరదలతో పలు రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. 70 లక్షల మందిపై ఈ వరద ప్రభావం పడింది. బ్రహ్మపుత్ర, జింజిరామ్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తోన్నాయి. నదీతీర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వరదలతో మిజోరాంలో ఐదుగురు మృతి చెందారు. అలాగే.. మహారాష్ట్ర, బీహార్‌లోనూ వరద ప్రభావం కొనసాగుతోంది. బీహార్‌లో వరద ఉధృతికి 24 మంది మృతి చెందారు.

అస్సోంలో వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల ధాటికి అస్సోం అతలాకుతలం అవుతోంది. దాదాపు 30 జిల్లాల్లో ఈ వరద ప్రభావం కొనసాగుతోంది. వరదతో 90 శాతం వరకు కాజీరంగా జాతీయ ఉద్యానవనం నీటమునిగి, అందులో వన్యప్రాణులు చిక్కుకున్నాయి. వాటిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

అలాగే.. అటు నేపాల్లో కూడా వదర బీభత్సం కొనసాగుతోంది. వరదల ధాటికి దాదాపు 67 మంది మృతి చెందగా, 24 మంది గల్లంతయ్యారు. వరద ఉధృతికి కొట్టుకుపోయిన పలు ఇళ్లు, వాహనాలు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

కాగా.. వరద ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ. వరదలపై మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే.. ఎప్పటికప్పుడు సమీక్షించనున్నారు.