బిల్డింగ్ కూలిన ఘటనలో 11 మృతదేహాలు వెలికితీత.. కొనసాగుతున్న రక్షణ చర్యలు
ముంబైలో పాత భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు 11 మృత దేహాలను వెలికి తీశారు. శిధిలాల కింద ఇంకా దాదాపు 40 మంది వరకు ఉండవచ్చని సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. అయితే వీరిలో ఎంతమంది ప్రాణాలతో ఉంటారో చెప్పడం కష్టమంటున్నారు. ముంబై డోంగ్రీ ప్రాంతంలో ఇరుకుగా ఉండే తండేల్ వీధిలోని కేసర్‌బాయి భవనం వందేళ్ల క్రితం నాటిది. నాలుగు అంతస్తులు గల ఈ భవనంలో దాదాపు 10 నుంచి 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. […]
ముంబైలో పాత భవనం కుప్పకూలిన ఘటనలో ఇప్పటివరకు 11 మృత దేహాలను వెలికి తీశారు. శిధిలాల కింద ఇంకా దాదాపు 40 మంది వరకు ఉండవచ్చని సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతున్నారు. అయితే వీరిలో ఎంతమంది ప్రాణాలతో ఉంటారో చెప్పడం కష్టమంటున్నారు. ముంబై డోంగ్రీ ప్రాంతంలో ఇరుకుగా ఉండే తండేల్ వీధిలోని కేసర్‌బాయి భవనం వందేళ్ల క్రితం నాటిది. నాలుగు అంతస్తులు గల ఈ భవనంలో దాదాపు 10 నుంచి 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు పురుషులు,నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందం తెలిపింది. భవన శిధిలాల కింద చిక్కుకున్న వారిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానికులు మానవహారంలా ఏర్పడి శిధిలాల తొలగింపులో భాగస్వాములవుతున్నారు.
మరోవైపు భవనంలో నివసించిన వారికి ఆశ్రయం కల్పించడానికి ఇమామ్‌వాడ బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు బీఎంసీ అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి కూడా రక్ష చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిధిలాల కింద దాదాపు 12 కుటుంబాలు ఉండవచ్చని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే ముంబాయిలో పాత భవనాలు, బ్రిడ్జిలు కూలిపోవడం తరచూ జరుగుతూనే ఉంది. వర్షాకాలం రావడంతోనే గోడలు కూలి 20 మందికిపైగా చనిపోయారు. అలాగే ఈ ఏడాది మార్చి నెలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ బయట కూలి ఐదుగురు చనిపోయారు.