
గుజరాత్‌లోని ఆదివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వడోదర, భరూచ్, నర్మద, దాహోద్ సహా పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న 11,900 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అలాగే పలు చోట్ల వరద నీటిలో చాలామంది చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 270 మందిని సహాయక బృందాలు రక్షించాయి. అలాగే ఈదురుగాలులతో రోడ్లపై అనేక చెట్లు కూలిపోయాయి. అయితే కూలిపోయిన చెట్లను తొలగించేందుకు పనులు వేగవంతం చేసున్నామని అలాగే రాకపోకలను సుగమం చేస్తున్నామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. అలాగే గత రెండు రోజుల్లో భరూచ్ జిల్లాలోని నర్మదా నదీ తీరం వెంట నివసిస్తున్న దాదాపు 6 వేల మందిని పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లారు. మరో విషయం ఏంటంటే సర్దార్ సరోవర్ జలాశయంలో నీటిమట్టం 40 అడుగులకు చేరింది. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే భారీ వర్షాల వల్ల నర్మదా నదిలో నీటి మట్టం క్రమంగా పెరుగతూ వస్తోంది. అయితే గోల్డెన్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా ఉన్నటువంటి నీటిమట్టం స్థాయి 28 అడుగులు ఉంది. కానీ ఇప్పుడు ఆ నీటిమట్టం ఏకంగా.. 37.72 అడుగులకు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. సర్దార్ సరోవర్ జలాశయం నుంచి ఎక్కువగా నీరు విడుదల కావడం వల్ల ఆదివారం ఇక్కడ నీటిమట్టం 40 అడుగులకు చేరిపోయింది. దీంతో దాండియా బజార్, భరూచ్ తదితర నగరాల్లో కొన్ని ప్రాంతాలు నీట మునిగిపోయాయి. అలాగే లోతట్టు ప్రాంతాల నుంచి కూడా ఈ నీరు తగ్గిపోతున్నట్లు విపత్తు ప్రతిస్పందన దళం అధికారులు పేర్కొన్నారు. మరోవైపు.. గుజరాత్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ వరద ప్రభావంతో దెబ్బతిన్న జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు ప్రజలను రక్షించేందుకు తక్షణ సాయం కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌లతో 10 బృందాలను ఇప్పటికే సిద్ధంగా ఉంచేశారు. ఇదిలా ఉండగా.. ఇప్పటిదాకా ఏకంగా 12వేల మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించామని ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. వరదలో చిక్కుకుపోయినటువంటి సుమారు 270 మందిని సహాయక బృందాలు రక్షించాయని పేర్కొన్నారు. అంతేకాదు వడోదర జిల్లాలో చూసుకుంటే ఓ చిన్న ద్వీపంలో 12 మంది చిక్కుకుపోయారు. అయితే ఆ 12 మందిని రక్షించేందుకు సహాయక బృందాలు దాదాపు 48 గంటలపాటుగా తీవ్రంగా శ్రమించాయి. చివరికి వారిని సురక్షితంగా తీసుకువచ్చాయి. మరోవైపు.. గుజరాత్‌లో మరిన్ని వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
మరిన్ని జాతీయవార్తల కోసం