MP CM Ramesh: భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్రపతి ఎన్నికలకు తమ అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని(Draupadi Murmu) ప్రకటించిన విషయం తెలిసిందే. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను నిలిపితే NDA తన అభ్యర్థిగా ముర్మును తెరపైకి తీసుకువచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై మేధోమథనం చేయడానికి బిజెపి పార్లమెంటరీ బోర్డు సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసి ఆమె పేరును ప్రకటించారు. అయితే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ము ప్రతిపాదన పత్రంపై ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంతకం చేశారు. ఏపీ నుంచి కేవలం రమేష్ ఒక్కరే సంతకం చేయడం విశేషం.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి శ్రీమతి ద్రౌపతి ముర్ము గారి ప్రతిపాదన పత్రంపై సంతకం చేసిన బీజేపీ రాజ్యసభ సభ్యులు సి.యం.రమేష్ గారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం సి.యం.రమేష్ గారు ఒక్కరే సంతకం చేయడం విశేషం.
– సి.యం.రమేష్ గారి కార్యాలయం, ఢిల్లీ. pic.twitter.com/C7kJiReQnS
— Dr. CM Ramesh (@CMRamesh_MP) June 23, 2022
ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. విపక్షాల అభ్యర్థిగా సిన్హా పేరును ప్రకటించిన తర్వాత, తదుపరి రాష్ట్రపతి ఎన్నికకు ఇప్పుడు జూలై 18న ఓటింగ్ జరుగనుంది. రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ పత్రాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి