Maharashtra – BJP vs NCP: మహారాష్ట్రలో ఎన్‌సీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుందా? శివసేన పార్టికి చెక్ పెట్టేందుకు మోదీ ఎలాంటి ప్లాన్ చేశారు? అది ఎలా బెడిసి కొట్టింది. ప్రత్యేక కథనం మీకోసం.. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్‌సీపీ ఈ మధ్య కాలంలో గళం మార్చింది. రాను రాను బీజేపీకి దగ్గరవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ప్రొత్సహిస్తున్నారు. దేశంలో అమలవుతున్న స్కీమ్స్ సూపర్ అంటూ కితాబులు ఇస్తున్నారు. అంతే కాదు.. గతంలోనే మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ తనను కోరారని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ఇటీవల వెల్లడించారు. అయితే, అది సాధ్యం కాదని తాను ప్రధానికి చెప్పినట్లు తెలిపారు.
ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడిన ఆయన.. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో తాను సమావేశమైన మాట నిజమేనని.. ఎన్సీపీ, బీజేపీ చేతులు కలపాలని ప్రధాని మోదీ కోరారని తెలిపారు. అయితే, అందుకు తాను ఒప్పుకోలేదని.. ఐనా ప్రధాని మరో మారు ఆలోసించుకోవాలని సలహా ఇచ్చారని గుర్తు చేశారు. చాలా రోజుల తర్వాత నిజాన్ని బయట పెట్టిన శరద్ పవార్ వ్యాఖ్యలు.. మహారాష్ట్ర పాలిటిక్స్‌లో దుమారం రేపుతున్నాయి. అధికారం కోసం ఎలాంటి దారులైనా తొక్కేందుకు బీజేపీ దిగజారుతుందనడానికి ఇది నిదర్శనమన్నారు శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్. ఆనాడు పదవీపై వ్యామోహంతో బీజేపీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవార్ చెప్పింది నిజమే అయి ఉంటుందని.. అధికారం కోసం ఆ పార్టీ ఎవరి చేతులు పట్టుకునేందుకైనా సిద్ధపడిందన్నారు.
Also read:
Ariyana Glory New: అదరగొడుతున్న అరియానా అందాలు.. రెడ్ డ్రస్ లో మెరుపులు..(ఫొటోస్)
Payal Rajput: హాట్ లుక్స్ తో మతిపోగోతున్న ఆర్‌డిఎక్స్ బ్యూటీ… పాయల్ ఎట్రాక్టీవ్ ఫొటోస్..
Dead Frog: ఓ ప్రముఖ చపాతీ పిండి ప్యాకెట్ నుంచి బయటపడిన చచ్చిపోయిన కప్ప.. కస్టమర్ షాక్..