కేరళలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. ఎమ్మెల్యే కప్పన్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎన్సీపీ

|

Feb 16, 2021 | 4:08 AM

MLA Mani C Kappan: కేరళలోని పాలా నియోజవర్గం ఎమ్మెల్యే మణి సీ కప్పన్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ కప్పన్‌ను పార్టీ నుంచి..

కేరళలో మారుతున్న రాజకీయ సమీకరణాలు.. ఎమ్మెల్యే కప్పన్‌ను పార్టీ నుంచి బహిష్కరించిన ఎన్సీపీ
Follow us on

MLA Mani C Kappan: కేరళలోని పాలా నియోజవర్గం ఎమ్మెల్యే మణి సీ కప్పన్‌ను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గానూ కప్పన్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ఎన్‌సీపీ సోమవారం ప్రకటించింది. కేరళలో ఎన్సీపీ నుంచి కప్పన్ ఒక్కరే గెలిచారు. అయితే కేరళ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మణి సీ కప్పన్‌ ఇటీవల అధికార ఎల్డీఎఫ్‌ కూటమిని వీడి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లో చేరారు. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పాలా నియోజకవర్గం ఎమ్మెల్యే కప్పన్‌ను ఎన్సీపీ బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లేఖను విడుదల చేశారు.

కాగా.. కప్పన్‌తోపాటు పలువురు కీలక నేతలు రెండు రోజుల క్రితం ఎన్సీపీకి రాజీనామా చేశారు. అనంతరం కప్పన్‌ తన నియోజకవర్గంలో భారీ రోడ్‌ షో నిర్వహించారు. దీంతోపాటు ఆదివారం ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత రమేష్ చెన్నితాల నేతృత్వంలో తలపెట్టిన ఐశ్వర్య కేరళ యాత్రలో.. యూడీఎఫ్ కూటమిలో కప్పన్ తదితర నాయకులు చేరారు. సిట్టింగ్ సీటు నుంచి మళ్లీ పోటీచేయనున్నట్లు కప్పన్ వెల్లడించారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కప్పన్ ఎన్సీపీ చీలిక నేతలతో కలిసి కొత్త పార్టీని స్థాపించనున్నారని సమాచారం.

Also Read:

Night curfew: మళ్లీ నైట్ కర్ఫ్యూ.. మెట్రో నగరాల్లో నెలాఖరు వరకు పెంచిన గుజరాత్ ప్రభుత్వం.. ఎందుకంటే..?