మన రోడ్లు గట్టివే..!.. నేషనల్ హైవేపై ల్యాండ్ అయిన విమానం..

| Edited By:

Jan 24, 2020 | 10:09 AM

మన జాతీయ రహదారులు వాహనాలు వెళ్లేందుకే కాదు.. విమానాలు కూడా ల్యాండింగ్ అయ్యేందుకు ఉపయోగపడతాయన్న విషయం గురువారం రుజువైంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో అకస్మాత్తుగా ఓ విమానం ల్యాండ్ అయ్యింది. ఎన్‌సీసీకి చెందిన ఓ చిన్న విమానం.. యూపీలోని బరేలీ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజన్లో సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు.. వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో వారి సూచన మేరకు విమానాన్ని జాతీయ రహదారిపైనే ల్యాండింగ్ […]

మన రోడ్లు గట్టివే..!.. నేషనల్ హైవేపై ల్యాండ్ అయిన విమానం..
Follow us on

మన జాతీయ రహదారులు వాహనాలు వెళ్లేందుకే కాదు.. విమానాలు కూడా ల్యాండింగ్ అయ్యేందుకు ఉపయోగపడతాయన్న విషయం గురువారం రుజువైంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో అకస్మాత్తుగా ఓ విమానం ల్యాండ్ అయ్యింది. ఎన్‌సీసీకి చెందిన ఓ చిన్న విమానం.. యూపీలోని బరేలీ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికి ఇంజన్లో సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్లు.. వెంటనే సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో వారి సూచన మేరకు విమానాన్ని జాతీయ రహదారిపైనే ల్యాండింగ్ చేయమని చెప్పడంతో.. వెంటనే ఘజియాబాద్ జిల్లాలోని సెకండ్ నంబర్ నేషనల్ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అయితే విమానం రెక్క ఒకటి మాత్రం పాక్షికంగా దెబ్బతింది.