Navjot Singh Sidhu: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం.. పంజాబ్ పార్టీ చీఫ్‌గా నవజ్యోత్ సింగ్ సిద్దూ
Punjab Congress Chief Navjot Singh Sidhu: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజ్యోత్‌సింగ్ సిద్దూను
Punjab Congress Chief Navjot Singh Sidhu: కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజ్యోత్‌సింగ్ సిద్దూను నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర సీఎం అమరీందర్ తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ సోనియా ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు సునీల్ జఖర్ స్థానంలో.. నూతన అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ బాధ్యతలను స్వీకరించారు. సిద్ధూతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సంగత్‌సింగ్, సుఖ్వీందర్ సింగ్, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్‌ను సోనియాగాంధీ నియమించారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో పలు సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా.. గత కొంతకాలంగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సిద్దూ పలుమార్లు అమరీందర్‌పై ఆరోపణలు, విమర్శలు సైతం చేస్తున్నారు. అంతేకాకుండా సిద్ధూ పలు ఎమ్మెల్యేలను, మంత్రులను సమీకరించి సొంత వర్గాన్ని సైతం కూటగట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది. దీంతో పంజాబ్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు సోనియా, రాహుల్, ప్రియాంక రంగంలోకి దిగారు.
వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నించిన్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సీఎం అమరేందర్ సింగ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూతో పలుమార్లు చర్చల అనంతరం సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, తక్షణమే అమల్లోకి వచ్చేలా.. నవజ్యోత్ సింగ్ సిద్ధూని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
Also Read: