
‘పకడ్బందీగా ఓట్ల చోరీ’. దేశం మొత్తం ఈ టాపిక్‌పై మాట్లాడుకుంటోందంటే… ఎలక్షన్ కమిషన్‌పై రాహుల్‌గాంధీ చేసిన ఈ ఆరోపణ చిన్నదేం కాదనే అర్థం. బ్యాలెట్ పద్దతి ఉన్నప్పుడు రిగ్గింగ్ ఆరోపణలు వచ్చేవి. ఈవీఎంలు వచ్చాక ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతోందని ఆరోపణలు. వీవీప్యాట్ల ప్రూఫ్స్ ఉన్నా సరే… ఇంకా ఏవో అనుమానాలు. ఇవన్నీ పక్కకు పోయాయి ఇప్పుడు. ఏకంగా ఓటర్ లిస్ట్‌నే టార్గెట్ చేస్తున్నారు. కావాల్సిన నియోజకవర్గాల్లో ఓటర్లను సృష్టించి ఎన్నికల్లో గెలుస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. రాహుల్ గాంధీ చేసిన ఈ కామెంట్స్ ఎలక్షన్ కమిషన్‌పైనే అయినా.. నేరుగా తాకింది మాత్రం బీజేపీనే. అందుకే, బీజేపీ నుంచి రియాక్షన్ వస్తోంది. సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో 48 ఓట్లు. ఒకే ఇంట్లో 80 ఓట్లు. ఇంటి నెంబర్ ‘జీరో’తో 100 ఓట్లు. ఒకే అడ్రస్‌తో 10వేలకు పైగా ఓటరు కార్డులు. ఎలా సాధ్యం ఇవన్నీ? రాహుల్‌గాంధీ ఇప్పుడు ప్రశ్నించారని కాదు గానీ.. ఓటర్ల జాబితా విషయంలో ఇలాంటి చిత్రవిచిత్రాలను ఎప్పటి నుంచో చూస్తున్నారు దేశ ప్రజలు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉండే వాళ్లకైతే రెండు రాష్ట్రాల ఓటర్ కార్డులు ఉంటాయి. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్ర ఓటర్లుగా వాళ్ల పేర్లు రెండు రాష్ట్రాల జాబితాలో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలా డబుల్ ఓటర్లు ఉన్నారు. సో, ఓటర్ల జాబితా విషయంలో అవకతవకలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ కూడా ఒప్పుకుంటోంది. అందుకేగా బిహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-SIR పేరుతో వాటన్నిటినీ...