National News Around India: యూపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లఖీంపూర్ అల్లర్ల తర్వాత అక్కడి రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంకగాంధీ కారు దిగి నడవటంతో హస్తం శ్రేణులు ఆందోళనకు దిగారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓ ర్యాలీలో మోదీ చేసి ‘56 అంగుళాల ఛాతీ’ వ్యాఖ్యను గుర్తు చేస్తూ విమర్శించారు.లద్దాఖ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చైనా బలగాల చొరబాటును ప్రస్తావిస్తూ.. రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.
ముంబై రేవ్ పార్టీలో డ్రగ్స్ పట్టుబడటంపై NCB అధికారులు మరింత దూకుడు పెంచారు. ఈకేసులో ఇప్పటికే 8మందిని అరెస్ట్ చేసిన అధికారులు రాత్రి అంధేరి, బాంద్రాలోని డ్రగ్స్ సప్లై చేస్తున్న మరికొందర్ని అదుపులోకి తీసుకొని NCB కార్యాలయానికి తీసుకెళ్లి విచారిస్తున్నారు.
లఖీంపూర్ అల్లర్లకు సీఎం యోగి ఆధిత్యనాథ్ నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, BSP చీఫ్ మాయావతి ఇవాళ యూపీ రానున్నారు. బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఆరాష్ట్ర సీఎం సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కి కౌంటర్ ఇచ్చారు. తనకు కరోనా రావడం వల్లే పదే పదే ఢిల్లీ వెళ్తున్నానని చేస్తున్న అవమానంపై మండిపడ్డారు. తన ఆరోగ్యంపై ఎవరికైనా అనుమానాలుంటే పరుగు పందెం పెట్టుకుందామంటూ శివారాజ్‌కు సవాలు విసిరారు కమల్‌నాథ్.
అక్టోబర్ 6నుంచి 16 వరకు జరిగే రామలీల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఎర్రకోట పరిసరాల్లో నిర్వహించే ఈ వేడుకలకు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా అనుమతలు ఇచ్చారు అధికారులు.
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐపీఎల్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. మొత్తం 10మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వాళ్ల దగ్గరున్న 10ల్యాప్‌టాప్‌లు,38 మొబైల్ ఫోన్స్, మూడు LED టీవీలను స్వాధీనం చేసుకున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో 50లక్షల పందాలు కాసినట్లుగా పోలీసులు రాబట్టారు.
ఒడిశాలోని మయూర్బంజ్ జిల్లాలో ఓ ఏనుగు గుంతలో పడిపోయింది. బయటకు రాలేక అవస్థలు పడటం గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. స్పాట్‌కి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగును బయటకు తీయడంతో అది అడవిలోకి పరుగులు పెట్టింది.
రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ కామెడీ జరిగింది. 17వ ఓవర్‌లో వేసిన సెకండ్ బాల్‌ని బౌలర్ సామ్‌కరన్ వైడ్ బాల్‌గా వేస్తే …దాన్ని ఆడేందుకు పరిగెత్తాడు బ్యాట్స్‌మెన్. బ్యాట్‌కి బంతి తగలకపోవడంతో స్టేడియంలో ఫ్యాన్స్‌తో పాటు క్రికెటర్లు నవ్వారు.
పుట్టుకతో వచ్చిన మరుగుజ్జు లోపాన్ని అదిగమించాడు ఓ యువకుడు. తన శరీర సౌష్టవాన్ని ధృడంగా మార్చుకొని అతి పొట్టి బాడీ బిల్డర్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకెక్కాడు మహరాష్ట్రకు చెందిన ప్రతీక్ విఠల్ మోహితే. 3అడుగుల 4అంగుళాల ఎత్తు ఉండి బాడీ బిల్డర్‌గా అనేక బహుమతులు గెలుచుకున్నాడు.
Read also: International News: అంతర్జాతీయ అద్భుతాలు, నేటి వింతలు విశేషాలు, సంచలనాలు.. టూకీగా