నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు!

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ). రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన 661 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ చర్యలు మొదలుపెట్టింది.

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌.. రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు!
The Herald House, New Delhi

Updated on: Apr 13, 2025 | 9:22 AM

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌ ఇచ్చింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్(ఈడీ). రూ. 661 కోట్ల ఆస్తుల స్వాధీనానికి నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన 661 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను జప్తు చేసేందుకు ఈడీ చర్యలు మొదలుపెట్టింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు, ఎజెఎల్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఆస్తుల జప్తునకు నోటీసులు జారీ చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో ఉన్న ఏజేఎల్ ఆస్తులను ఇప్పటికే గుర్తించింది.

నేషనల్ హెరాల్డ్ దినపత్రికను ప్రచురించే ఎజెఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ సంస్థలో సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీకి కలిపి 38 శాతం వాటా ఉంది. అయితే కాంగ్రెస్‌ పార్టీకి ఏజేఎల్ బకాయి పడిన 90 కోట్ల రూపాయల విలువైన షేర్లను వసూలు చేసుకునే క్రమంలో యంగ్ ఇండియా సంస్థలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది. అలాగే ఎజెఎల్ ఆస్తులను ఉపయోగించి 18 కోట్ల రూపాయల నకిలీ విరాళాలు, 38 కోట్ల రూపాయల నకిలీ అద్దెలు, 29 కోట్ల రూపాయల నకిలీ ప్రకటనల ద్వారా యంగ్‌ ఇండియా సంస్థ అక్రమంగా డబ్బు సంపాదించిందని ఈడీ వాదిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేను ఈడీ విచారించింది. వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.

సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదును ఢిల్లీ కోర్టు పరిగణనలోకి తీసుకున్న తర్వాత 2021లో ED దర్యాప్తు ప్రారంభమైంది. ఏజేఎల్‌కు చెందిన రూ. 2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను మోసపూరితంగా స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యింద. ఇందులో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దివంగత మోతీలాల్ వోహ్రా, దివంగత ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబే, సామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ అనే ప్రైవేట్ కంపెనీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను ఈ కేసులో చేర్చింది ఈడీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..