Covid-19: పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం..

National emergency-like situation says SC: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. నిన్న మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 2వేల మందికి పైగా మరణించారు. ఇలాంటి విపత్కర

Covid-19: పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.. కేంద్రంపై ‘సుప్రీం’ ఆగ్రహం..
Supreme Court

Updated on: Apr 22, 2021 | 3:30 PM

Supreme Court on Sentral Government: దేశవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. నిన్న మూడు లక్షలకు పైగా కేసులు నమోదు కాగా.. 2వేల మందికి పైగా మరణించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ వైపు ఆక్సిజన్ కొరత.. మరోవైపు మందులు, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత వేధిస్తుందని.. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. దేశవ్యాప్తంగా పరిస్థితి అల్లకల్లోలంగా మారిందని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చోద్యం చూడటం సరికాదంటూ చీఫ్ జస్టిస్ కేంద్రంపై మండిపడ్డారు. దేశంలోని ఆరు హైకోర్టుల్లో కరోనా మహమ్మారి సంబంధిత కేసులు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత, ఆసుపత్రుల్లో పడకలు, యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివిర్ అందుబాటులో లేకపోవడంపై దాఖలైన పిటిషన్లను హైకోర్టులు విచారిస్తున్నాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే గురువారం స్పందించారు. ఈ సమస్యపై సుమోటోగా విచారణ జరపాలనుకుంటున్నట్లు తెలిపారు.

వీటి పరిష్కారానికి ఓ జాతీయ ప్రణాళిక అవసరమని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కోవిడ్ మహమ్మారికి మందులు అందుబాటులో లేని సమయంలో చోద్యం చూడటం సరికాదంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరా, అత్యవసర మందుల సరఫరా, ఆసుపత్రుల్లో బెడ్స్ కొరత, వ్యాక్సినేషన్ విధానంపై జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే.. లాక్‌డౌన్‌ను ప్రకటించే అధికారం మాత్రం రాష్ట్రాలకే ఉందంటూ ఆయన వివరించారు.

అయితే ప్రస్తుతం పరిస్థితులు గందరగోళంగా, అయోమయంగా ఉన్నాయని బోబ్డే తెలిపారు. వనరుల దారి మళ్లింపు జరుగుతోందని.. చర్యలు తీసుకోవడంలో చొరవ చూపించడం లేదంటూ కేంద్రంపై అసహనం వ్యక్తంచేశారు. ఇంకా చోద్యం చూడటం ఎంటంటూ విమర్శించారు. ఈ సమస్యలపై కోర్టుకు సలహాలు ఇచ్చేందుకు అమికస్ క్యూరీగా ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే దీనిపై తదుపరి విచారణ శుక్రవారం జరనుంది.

Also Read:

BECIL Recruitment: నిరుద్యోగులకు శుభవార్త… బీఈసీఐఎల్‌లో 463 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. నేడు చివరి తేదీ

Aadhaar Card: మీ ఆధార్‌ కార్డు పోగొట్టుకున్నారా..? ఒక్క ఎస్‌ఎంఎస్‌తో ఆధార్‌ నెంబర్‌ను లాక్‌ చేయవచ్చు… ఎలాగంటే..!