India Corona Updates: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

|

Jun 04, 2021 | 10:39 AM

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌, మరో వైపు లాక్‌డౌన్‌తో పాజిటివ్‌ కేసుల తగ్గుముఖం పడుతోంది.గత కొన్ని రోజులు..

India Corona Updates: భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!
India Corona Updates
Follow us on

India Corona Updates: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఒక వైపు కరోనా వ్యాక్సినేషన్‌, మరో వైపు లాక్‌డౌన్‌తో పాజిటివ్‌ కేసుల తగ్గుముఖం పడుతోంది.గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 1.5 లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 20,75,428 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,32,364 మందికి పాజిటివ్‌గా తేలింది. 24గంటల వ్యవధిలో 2,713 మంది ప్రాణాలు కోల్పోయారు. క్రితం రోజు కంటే మరణాల సంఖ్య తక్కుగానే నమోదైంది. మొత్తంగా ఇప్పటివరకూ 2,85,74,350 మందికి కరోనా సోకగా,3,40,702 మంది మరణించారు.

ఇక, క్రియాశీలరేటు 6.02 శాతానికి తగ్గగా, రికవరీరేటు 92.79 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 16,35,993 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 2,07,071 మంది కోలుకోగా, ఇప్పటివరకు 2.65కోట్ల మంది ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. క్రియాశీల కేసుల్లో తగ్గుదల, కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం సానుకూలాంశాలు. మరోవైపు నిన్న 28,75,286 మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 22,41,09,448కి చేరింది.

Andhra Pradesh: రెండు వారాల్లో 24 వేల మంది చిన్నారులకు పాజిటివ్… ముంచుకొస్తున్న థర్డ్ వేవ్‌కు ఇది సంకేతమా..!

Telangana Corona Cases: తెలంగాణలో కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది.. త్వరలో లాక్‌డౌన్ ఎత్తివేసే ఛాన్స్ః శ్రీనివాసరావు