Independence Day 2023: మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుంది: ప్రధాని మోదీ

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటిస స్థానంలో ఉన్నామన్నారు. వీరుల బలిదానంతో స్వాతంత్ర్యం వచ్చిందని, త్యాగధనులందరికీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి ఏర్పడుతుందని అన్నారు. దేశమంతా మణిపూర్‌ వెంట ఉంది. చిన్న సమస్యలే ఇబ్బందిగా మారుతున్నాయి..

Independence Day 2023: మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుంది: ప్రధాని మోదీ
Pm Narendra Modi

Edited By:

Updated on: Aug 15, 2023 | 8:21 AM

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. స్వాతంత్రదినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని జెండాలను ఆవిష్కరిస్తున్నారు. రాజ్‌ఘట్‌లో నివాళులు అర్పించిన ప్రధాని మోదీ.. పంద్రాగస్ట్‌ వేడుకల సందర్భంగా ఎర్రకోటలో జెండాను ఆవిష్కరించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అన్నారు. 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటిస స్థానంలో ఉన్నామన్నారు.

వీరుల బలిదానంతో స్వాతంత్ర్యం వచ్చిందని, త్యాగధనులందరికీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగంలో మణిపూర్ ప్రస్తావన వచ్చింది. మణిపూర్‌లో త్వరలోనే శాంతి ఏర్పడుతుందని అన్నారు. దేశమంతా మణిపూర్‌ వెంట ఉంది. చిన్న సమస్యలే ఇబ్బందిగా మారుతున్నాయి. అయితే ప్రధానిగా మోదీ పతకావిష్కరణ చేయడం ఇది పదోసారి.

 


ప్రజాస్వామ్యం, భిన్నత్వంలో ఏకత్వం మన దగ్గరున్నాయని అన్నారు. 30 ఏళ్లలోపు యువత దేశానికి ఆశాకరణాలు అని, మనం తీసుకునే నిర్ణయాలు మరో వెయ్యేళ్లపై ప్రభావం చూపుతుందన్నారు. యువత శక్తి, సామర్థ్యాలపై ఎంతో విశ్వాసం ఉందని, మొదటి మూడు స్టార్టప్‌లలో భారత యువత ఉందని, డిజిటల్‌ రంగంలో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నామన్నారు. పేద కుటుంబాలు, చిన్న గ్రామాల నుంచి వాళ్లు ఉన్నారన్నారు.

 

క్రీడారంగంలో ప్రతిభను చాటుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో రైతులు, కార్మికులది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర ఉందని అన్నారు. అలాగే జీ-20 సదస్సు నిర్వహించే అవకాశం మనకు దక్కిందని, జ-20 సదస్సుతో ప్రపంచానికి మన సామర్థ్యాన్ని చాటుతున్నామని అన్నారు. కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచానినిక భారత్‌పై సరికొత్త విశ్వాసమన్నారు. ప్రపంచాన్ని మార్చడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించబోతున్నామని మోదీ అన్నారు.

 

 

దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుందని, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను నెరవేరుస్తు్న్నామని అన్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని మోదీ వెల్లడించారు. 4 కోట్ల రూపాయలతో దేశంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చామని అన్నారు. అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి చేరుకున్నామని అన్నారు. అవినీతి నిర్మూలన, పేదల సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మోదీ పేర్కొన్నారు.