Nanded Hospital Deaths: ‘ఆసుపత్రి డీన్‌తో టాయిలెట్లు శుభ్రం చేయించడం సరికాదు..’ ఐఎమ్‌ఏ హెచ్చరిక

|

Oct 04, 2023 | 7:11 PM

నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి డీన్‌తో శివసేన ఎంపీ హేమంత్‌ పాటిల్‌ మరుగు దొడ్లను శుభ్రం చేయించిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చణీయాంశమైంది. దీనిపై జాతీయ వైద్యుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేసింది. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మంది రోగులు మరణించిన సంగతి తెలిసిందే. రోగుల మరణాలపై హింగోలిలో..

Nanded Hospital Deaths: ఆసుపత్రి డీన్‌తో టాయిలెట్లు శుభ్రం చేయించడం సరికాదు.. ఐఎమ్‌ఏ హెచ్చరిక
Nanded Hospital Deaths
Follow us on

ఠాణే, అక్టోబర్‌ 4: మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రి డీన్‌తో శివసేన ఎంపీ హేమంత్‌ పాటిల్‌ మరుగు దొడ్లను శుభ్రం చేయించిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చణీయాంశమైంది. దీనిపై జాతీయ వైద్యుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేసింది. నాందేడ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో 48 గంటల్లో 31 మంది రోగులు మరణించిన సంగతి తెలిసిందే. రోగుల మరణాలపై హింగోలిలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ హేమంత్‌ పాటిల్‌ మంగళవారం సదరు శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కాలేజీని సందర్శించారు. దీంతో ఆ ఆసుపత్రి తాత్కాలిక డీన్‌గా వ్యవహరిస్తోన్న శ్యాం రావ్‌ వాకోడ్‌తో శివసేన ఎంపీ టాయిలెట్లను శుభ్రం చేయించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఆందోళన చేపడతామని డాక్టర్ల సంఘం బెదిరించింది.

డీన్‌కు టాయిలెట్లు శుభ్రం చేయించినందుకు ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు మెమోరాండం సమర్పించారు. నాందేడ్ ఆసుపత్రి మరణాలపై సరైన విచారణ జరపాలని వైద్య వర్గాలు కూడా కోరుతున్నాయి. రోగుల రద్దీని పరిగణనలోకి తీసుకుంటే ఆసుపత్రిలో సిబ్బంది సంఖ్య సరిపోదని వైద్యుల సంఘం పేర్కొంది. అవసరమైన చర్యలు తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని మెమోరాండంలో పేర్కొన్నారు. ఆసుపత్రి తాత్కాలిక డీన్‌ పట్ల ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం ఏక్‌నాథ్‌ శిందేకు వినతిపత్రం సమర్పించినట్టు మహారాష్ట్ర భారతీయ వైద్య సంఘం (IMA) ఓ ప్రకటనలో తెలిపింది. నాందేడ్‌ ఆస్పత్రిలో మరణాలపై సరైన విచారణ జరపాలని తాము కోరుతున్నట్టు అందులో కోరారు. అయితే వైద్య కాలేజీ డీన్‌తో టాయిలెట్లు కడించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీన్‌తో ఎంపీ వ్యవహరించిన తీరు మాత్రం సమర్థనీయం కాదన్నారు. రోగుల రద్దీని పరిగణనలోకి తీసుకుంటే ఆస్పత్రిలో సిబ్బంది సంఖ్య సరిపోదని పేర్కొంది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా ఐఎంఏ- మహారాష్ట్ర హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

ఎంపీపై పోలీసులకు డీన్‌ ఫిర్యాదు

ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వర్తించనీయకుండా అడ్డుకోవడం, పరువు నష్టం వంటి అభియోగాలపై ఎంపీ హేమంత్‌ పాటిల్‌పై వైద్యా కాలేజీ డీన్‌ వాకోడ్‌ పోలీసులకు బుధవారం (అక్టోబర్‌ 4) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.