Nanded Hospital Deaths: నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష.. 48 గంటల్లో 31 మంది రోగులు మృతి

|

Oct 11, 2023 | 3:22 PM

మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగడం లేదు. గడచిన 48 గంటల్లో మరో 31 మరణాలు అక్కడ నమోదవడం కలకలం రేపుతోంది. గతచిన 8 రోజుల్లో అక్కడ మొత్తం 108 మంది రోగులు మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లోనే ఓ పసికందుతో సహా 11 మంది మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది.  దీనిపై సెంట్రల్ నాందేడ్‌లోని ప్రభుత్వ వైద్య కాలేజీ కమ్‌ ఆసుపత్రి సిబ్బందింని ప్రశ్నించగా అక్కడ మందుల కొరతలేదని..

Nanded Hospital Deaths: నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష.. 48 గంటల్లో 31 మంది రోగులు మృతి
Nanded Hospital Deaths
Follow us on

నాందేడ్‌, అక్టోబర్ 11: మహారాష్ట్రలోని నాందేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో మృత్యుఘోష ఆగడం లేదు. గడచిన 48 గంటల్లో మరో 31 మరణాలు అక్కడ నమోదవడం కలకలం రేపుతోంది. గతచిన 8 రోజుల్లో అక్కడ మొత్తం 108 మంది రోగులు మృత్యువాత పడ్డారు. గత 24 గంటల్లోనే ఓ పసికందుతో సహా 11 మంది మరణించడం పలు అనుమానాలకు తావిస్తోంది.  దీనిపై సెంట్రల్ నాందేడ్‌లోని ప్రభుత్వ వైద్య కాలేజీ కమ్‌ ఆసుపత్రి సిబ్బందింని ప్రశ్నించగా అక్కడ మందుల కొరతలేదని డాక్టర్ శంకర్‌రావ్ చవాన్, ఆసుపత్రి డీన్ శ్యామ్ వాకోడ్ పునరుద్ఘాటించారు. గత 24 గంటల్లో 1100ల మందికి పైగా రోగులకు వైద్యులు చికిత్స అందించారని, కొత్తగా మరో 191 మంది రోగులను ఆసుపత్రిలో చేర్చుకున్నామన్నారు.

24 గంటల్లో సగటు మరణాల రేటు గతంలో రోజుకు 13గా ఉండేదని, ఇప్పుడు 11కి తగ్గిందని తమ చర్యను సమర్ధించుకున్నారు. మరణాలలో అధికంగా పుట్టుకతో వచ్చే రోగాలతో బాధపడే పిల్లలు అధికంగా ఉంటుంన్నారని అన్నారు. ఆసుపత్రి సదుపాయాల్లో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఇక ఆసుపత్రిలో మందుల స్టాక్‌ గురించి ప్రశ్నించగా.. సాధారణంగా ఆసుపత్రి బడ్జెట్‌ను బట్టి మూడు నెలలకు సరిపడా స్టాక్‌ అందుబాటులో ఉంటుందని, మందుల కొరత కారణంగా ఏ రోగి చనిపోలేదని అన్నారు. వారి ఆరోగ్యం క్షీణించడం వల్లే వారు చనిపోయారంటూ ఆసుపత్రి డీన్‌ చెప్పుకొచ్చారు.

దీనిపై కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మాట్లాడుతూ.. నాందేడ్ ఆసుపత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో 60 మందికి పైగా శిశువులు చేరారు. అయితే శిశువులను చూసుకోవడానికి కేవలం ముగ్గురు నర్సులు మాత్రమే ఉన్నారు. ఒకేసారి ముగ్గురు శిశువులకు చికిత్స చేయడానికి ఒక వార్మర్‌ని ఉపయోగిస్తున్నారంటూ ఆసుపత్రిలోని స్టాఫ్‌ తీరును ప్రశ్నించారు. డాక్టర్ శంకర్‌రావ్ చవాన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లోని ఎన్‌ఐసీయూలో కేవలం ముగ్గురు నర్సులు మాత్రమే పనిచేయడం ఏంటని ప్రశ్నించారు. ఆసుపత్రి సామర్ధ్యం కంటే ఎక్కువ మంది రోగులు ఉన్నారన్నారు. 500 పడక గదులు ఉన్న ఆసుపత్రిలో 1000 మందికిపైగా రోగుల్ని ఎలా అడ్మిట్‌ చేసుకున్నారని ప్రశ్నించారు. ఇక్కడ ముందుల కొరత, సిబ్బంది కొరత ఉందనడం వాస్తవమని, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రోగులు పిట్టల్లా రాలిపోతున్నారని, ఈ రాష్ట్ర ప్రభుత్వం జనాల ప్రాణాలతో చలగాటం ఆడుతోందంటూ మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.