భర్త పైశాచికం.. కాళ్లు, చేతులు కట్టేసి బలవంతపు శృంగారం.. కోర్టు ఏం చేసిందంటే..
భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం అతి సున్నితమైనది. ఇరువురు పరస్పర అంగీకారంతో ఉన్నప్పుడు కలయికలో పాల్గొంటే.. వారిద్దరి మధ్య గాఢమైన బంధం ఏర్పడుతుంది. అంతే కాదు..
భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం అతి సున్నితమైనది. ఇరువురు పరస్పర అంగీకారంతో ఉన్నప్పుడు కలయికలో పాల్గొంటే.. వారిద్దరి మధ్య గాఢమైన బంధం ఏర్పడుతుంది. అంతే కాదు ఆనందం, ఆరోగ్యం కూడా. శృంగార సమయంలో భాగస్వామికి ఇష్టం లేకుంటే వారిని బలవంతం చేయవద్దు. మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన ఆందోళన కలిగిస్తోంది. రోజూ మద్యం తాగి వచ్చే భర్త.. తనకు ఇష్టం లేకున్నా బలవంతంగా సెక్స్ లో పాల్గొనేవాడని కోర్టులో పిటిషన్ వేసింది. కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో వస్త్రాలు పెట్టి తన కోరిక తీర్చుకునేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో కలిసి జీవించలేనని, విడాకులు కావాలంటూ న్యాయస్థానంలో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. దీనిని తీవ్ర అంశంగా పరిగణించింది. బాధితురాలికి విడాకులు మంజూరు చేసింది.
భార్యతో అత్యంత క్రూరంగా ప్రవర్తించిన భర్తకు మహారాష్ట్ర నాగ్ పుర్ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. తన భర్త రోజూ మద్యం తాగి వచ్చి, కాళ్లు, చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి బలవంతంగా శృంగారం చేస్తున్నాడని కోర్టును అశ్రయించిన మహిళకు న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. భర్త ఇలా చేయడం అత్యంత క్రూరమైన చర్య అని వ్యాఖ్యానించింది. భార్య అంటే బానిస కాదని ఆవేదన వ్యక్తం చేసింది. భర్త నుంచి విడాకులు పొందిన ఆ మహిళ వయసు 22 ఏళ్లే కావడం గమనార్హం.
తన భర్త మద్యానికి బానిసై.. రోజా తాగి ఇంటికి వచ్చేవాడు. కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో వస్త్రాలు కుక్కి బలవంతంగా కోరిక తీర్చుకునేవాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించేవాడు. అతడి వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. తనకు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. వారి సహాయంతో విడాకుల కోసం పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు విడాకులు మంజూరు చేసింది.
Also Read
Viral Video: ప్రేమలో మునిగితేలుతున్న డేగలు.. గాలిలో విహరిస్తూ ఏం చేశాయంటే..? వీడియో
వేప, రావి చెట్లకు అంగరంగ వైభవంగా వివాహం.. ఆపై విందు భోజనం.. ఎక్కడంటే..
Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..