Nagaland: హెల్మెట్ లేకుండా బైక్‌పై ఫోటోలకు పోజులిచ్చిన మంత్రి.. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

నాగాలాండ్ మంత్రి తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్ సోషల్‌ మీడియాలోయాక్టివ్‌గా ఉంటారు. విచిత్ర పోస్టులు పెట్టి అందికీ నవ్వులు పంచుతారు. తాజాగా ఆయన షేర్ చేసిన చిత్రం కూడా ఇప్పుడు కూడా అలాంటిదే. అయితే ఆ చిత్రాన్ని గమనిస్తే బైక్‌ మీద తెమ్జెన్‌తో పాటు మరో వ్యక్తి కూడా కూర్చొని ఉన్నారు. ఇద్దరూ కూడా చిరునవ్వులు చిందిస్తున్నారు. అయితే ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వారిద్దరికీ కూడా హెల్మెట్ లేదు. ఈ ఫొటోకు మంత్రి ఓ వ్యాఖ్యను […]

Nagaland: హెల్మెట్ లేకుండా బైక్‌పై ఫోటోలకు పోజులిచ్చిన మంత్రి.. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే
Temjen Imna Along

Updated on: May 25, 2023 | 4:20 AM

నాగాలాండ్ మంత్రి తెమ్జెన్‌ ఇమ్నా అలోంగ్ సోషల్‌ మీడియాలోయాక్టివ్‌గా ఉంటారు. విచిత్ర పోస్టులు పెట్టి అందికీ నవ్వులు పంచుతారు. తాజాగా ఆయన షేర్ చేసిన చిత్రం కూడా ఇప్పుడు కూడా అలాంటిదే. అయితే ఆ చిత్రాన్ని గమనిస్తే బైక్‌ మీద తెమ్జెన్‌తో పాటు మరో వ్యక్తి కూడా కూర్చొని ఉన్నారు. ఇద్దరూ కూడా చిరునవ్వులు చిందిస్తున్నారు. అయితే ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వారిద్దరికీ కూడా హెల్మెట్ లేదు. ఈ ఫొటోకు మంత్రి ఓ వ్యాఖ్యను జోడించారు. ‘హెల్మెట్ ఏదని అందరూ నన్ను అడుగుతారు. కానీ ఫొటో దిగడానికి స్టైల్ కావాలి కదా.. అప్పుడు హెల్మెట్ లేకపోయినా ఫర్వాలేదు కానీ.. ప్రయాణంలో మాత్రం ఉండాలి’ అని తెమ్జెన్‌ వెల్లడించారు.

ఆయన చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. నెటీజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తు్న్నారు. హార్లేడేవిడ్‌సన్ సంస్థ ఈ ఫొటోను యాడ్స్‌ కోసం వాడుకోవచ్చు, గుడ్ పోజ్‌ అంటూ స్పందించారు. అయితే తెమ్జెన్‌ పెట్టే పోస్టు ఒకవైపు నవ్వులు పంచినా.. మరోపక్క దాంట్లో ప్రజాప్రయోజనం ఉంటుంది. ప్రధాని మోదీ ఆయన ట్వీట్లపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తారు. ఈ విషయాన్ని ప్రధాని కూడా స్వయంగా వెల్లడించారు. ఈ నాగాలాండ్ మంత్రి.. మోదీని గురూజీ అంటూ పిలుస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..