
Mohammad Iqbal Lone Inspirational Story: పర్యావరణం బాగుంటేనే మనం బాగుంటాం.. లేకపోతే భవిష్యత్తు తరాలు ప్రశ్నార్థకంగా మారుతాయి.. అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం కొందరు నడుంబిగించి అందరికీ ఆదర్శవంతంగా మారుతున్నారు. పర్యావరణం కోసం ఎనలేని కృషి చేస్తూ.. ఎన్నో అవార్డులను సైతం అందుకుంటున్నారు. అయితే, 50 వ పర్యావరణ దినోత్సవం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా భారత ప్రభుత్వం ‘మై ఇండియా – మై లైఫ్ గోల్స్’ పేరుతో లైఫ్‌స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్ – లైఫ్ అనే నినాదంతో పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ ఉద్యమంలో టీవీ9 సైతం భాగస్వామ్యమై.. పర్యవరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న గ్రీన్ వారియర్స్ జీవిత కథనాలు, వారు చేసిన కృషి లాంటి వాటిని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు వెళ్తోంది.
అయితే, పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల పెంపకంతో పాటు, జీవ-వైవిధ్యాన్ని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇక్బాల్ లోన్.. పర్యావరణ కార్యకర్త మహమ్మద్ ఇక్బాల్ లోన్ కశ్మీర్‌లో పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎన్నో రకాల మొక్కలను భారత సైనిక రంగానికి అందజేస్తుంటారు. అంతేకాకుండా భారత్ – పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలలో సైతం మొక్కలు నాటడం ఇక్బాల్ లోన్ ప్రత్యేకత. అందుకే ఇక్భాల్ లోన్ స్వర్గం అనేది ఎక్కడో లేదు.. భూమ్మీదే ఉందని తరచూ చెబుతుంటారు. ఇక్బాల్ లోన్ ఇంకేమన్నారో.. ఆయన మాటల్లోనే వినండి..
‘‘స్వర్గం అనేది.. ఎక్కడో లేదు.. భూమ్మీదే ఉందని నమ్ముతాను. చెట్లను పెద్ద మొత్తంలో నరికేస్తుంటే .. రాగల కాలంలో స్వర్గం అనేది ఎవరికీ కనిపించదు. నమస్కారం.. నా పేరు ఇక్బాల్ లోన్.. కశ్మీర్‌లోని ఉరి ప్రాంతంలో నివాసం ఉంటాను. కార్చిచ్చు కారణంగా.. 40 నుంచి 50 శాతం అడవి కనుమరుగైంది.. పరిస్థితి క్రమంగా తిరిగి సాధారణస్థితికి వస్తోంది. జల్ జంగల్ జమీన్ .. ఏవీ లేకపోతే.. జీవజాలం మనుగడ అసంభవం..’’ ఇక్బాల్ లోన్ పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..