PM Modi – Jupally Rameshwar Rao: ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు

మై హోమ్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, ఆయన కుమారుడు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు గురువారం (నవంబర్ 7న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు.

PM Modi - Jupally Rameshwar Rao: ప్రధాని మోదీని కలిసిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు
Jupally Rameswar Rao, Ramu Rao Meet PM Modi

Updated on: Nov 07, 2024 | 9:54 PM

మై హోమ్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ జూపల్లి రామురావు గురువారం (నవంబర్ 7న) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వర్ రావు, రామురావు.. ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు. శాలువాతో ఆయన్ను సత్కరించి.. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విగ్రహ జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. జూపల్లి రామేశ్వర్ రావు, రామురావుతో ఆప్యాయంగా మాట్లాడారు.

Jupally Rameswar Rao, Ramu Rao Meet PM Modi

ప్రధాని నరేంద్ర మోదీ 2022లో హైదరాబాద్‌లో స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీని ప్రారంభించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన సమాతామూర్తి శ్రీ రామానుజా చార్యులవారి విగ్రహాన్ని ఆవిష్కరించింది ప్రధాని నరేంద్ర మోదీనే..

ఆధ్యాత్మిక విలువలున్న నేతగా ప్రధానమంత్రికి గుర్తింపు ఉంది. ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే లీడర్. అటు ఆధ్యాత్మికంగా.. ఇటు రాజకీయంగా ప్రధాని మోదీ.. మొదటి స్థానంలో నిలవడంతోపాటు.. ప్రపంచంలో బలమైన నేతగా ఎదిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..