Vinayaka Chavithi: గణపతిని ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేస్తోన్న ముస్లిం మహిళ.. ఫత్వా జారీ చేసిన మత పెద్దలు

|

Sep 03, 2022 | 11:51 AM

తాను హిందువుల ప్రతి పండుగను జరుపుకుంటాను .. అదే విధంగా వినాయక చవితిని కూడా జరుపుకుంటున్నట్లు రూబీ పేర్కొన్నారు. తాను చేస్తున్న పనిపై ఇప్పటికే నాపై ఫత్వా జారీ చేసి పోస్టర్లు కూడా వేశారు.

Vinayaka Chavithi: గణపతిని ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేస్తోన్న ముస్లిం మహిళ.. ఫత్వా జారీ చేసిన మత పెద్దలు
Muslim Woman Vinayaka Chavi
Follow us on

Vinayaka Chavithi:  దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దలు, పిల్లలు సంతోషముగా గణపతిని పూజిస్తున్నారు. అయితే వినాయక చవితి వేడుకలను తన ఇంట్లో జరుపుకుంటున్న ఓ ముస్లిం కుటుంబంపై ఫత్వా జరీ చేయబడింది. ఈ ఘటన   ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లోని రోరావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రూబీ ఆసిఫ్ ఖాన్ అనే ముస్లిం మహిళ .. వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి.. పూజలను చేస్తున్నారు. దీంతో రుబీపై మతపెద్దల అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆమెపై ఫత్వా జారీ చేశారు.

భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మండల ఉపాధ్యక్షురాలు రూబీ ఆసిఫ్ ఖాన్ తనకు ఫత్వా జారీ చేసిన మౌలానాపై మండిపడ్డారు. హిందూ దేవుళ్లు, దేవతలపై వ్యాఖ్యానించిన సహరాన్‌పూర్‌కు చెందిన మౌలానా ముఫ్తీ అర్షద్ ఫరూఖీ జిహాదీ, ఉగ్రవాది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు పూజ, ఆరాధన విశ్వాసాల గురించి వివాదాస్పద ప్రకటనలు చేసే మతపెద్దలు నిజమైన ముస్లింలు కాలేరని చెప్పారు. ఇలాంటి వారు దేశాన్ని విభజించాలనుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రుబీ.

అంతేకాదు హిందూ-ముస్లిం సోదరులందరూ కలిసి మెలిసి జీవించాలన్నారు. తాను గణపతికి చేస్తున్న పూజలకు సంబంధించి ఇప్పటికే ఫత్వాలు జారీ అయ్యాయి. ముఫ్తీ అర్షద్ ఫరూఖీ లాంటి వ్యక్తులు దేశాన్ని విభజించాలని చూస్తున్నారని చెప్పారు.  ఇలాంటి వ్యక్తులు తమను తాము వివక్షతను కోరుకుంటున్నారు. అంతేకాదు భారత దేశంలో ఉంటూ.. దేశం గురించి మాట్లాడుతూ..  ఫత్వాలు జారీ చేయడం ఏమిటంటూ మౌలానా తీరుపై ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

తాను హిందువుల ప్రతి పండుగను జరుపుకుంటాను .. అదే విధంగా వినాయక చవితిని కూడా జరుపుకుంటున్నట్లు రూబీ పేర్కొన్నారు. తాను చేస్తున్న పనిపై ఇప్పటికే నాపై ఫత్వా జారీ చేసి పోస్టర్లు కూడా వేశారు. అయితే తనకు కావలసింది హిందూ-ముస్లిం ఐక్యత చెక్కుచెదరకుండా ఉండటమేఅన్నారు.  రెండు రోజుల క్రితం రూబీ ఆసిఫ్ ఖాన్ తన ఇంట్లో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

దేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకునే గణేష్ ఉత్సవాల్లో ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు కూడా పాల్గొంటారు. అంతేకాదు చాలా మంది ముస్లిం సినీ తారలు కూడా తమ ఇళ్లలో గణేష్ జీని పూజిస్తారు .. సాంప్రదాయ రీతిలో నిమజ్జనం చేస్తారన్న సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..