Ramayana: రామాయణ క్విజ్‌ విజేతగా ముస్లిం స్టూడెంట్స్.. ఇతిహాసాలు మన సంస్కృతి లో భాగం భారతీయులందరూ చదవాలని పిలుపు

|

Aug 08, 2022 | 12:24 PM

రాముడు తన తండ్రి దశరథుడికి ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు.. నేడు అధికారం కోసం అంతులేని పోరాటం చేస్తున్న కాలంలో జీవిస్తున్నామని తెలిపారు. మనం రాముడి వంటి పాత్రల నుండి ,రామాయణం వంటి ఇతిహాసాల సందేశం నుండి ప్రేరణ పొందాలి" అని  బాసిత్ , జబీర్ లు వివరించారు

Ramayana: రామాయణ క్విజ్‌ విజేతగా ముస్లిం స్టూడెంట్స్.. ఇతిహాసాలు మన సంస్కృతి లో భాగం భారతీయులందరూ చదవాలని పిలుపు
Muslim Student Won Ramayana
Follow us on

Ramayana: రామాయణ మహాభారత గ్రంథాలు.. నేటి మానవాళి జీవన విధానానికి మార్గదర్శకాలని హిందువుల నమ్మకం. అయితే ఈ పవిత్ర గ్రంథాలను నేటి తరానికి అందించే ఆలోచన మాత్రం తల్లిదండ్రులు చేయడం లేదనేది వాస్తవం. అయితే ఓ ఇద్దరు ముస్లిం యువకులు మాత్రం రామాయణంలోని శ్లోకాలను చకచకా వల్లెవేస్తున్నారు. అంతేకాదు మీకు ఇష్టమైన శ్లోకం ఏమిటంటే.. అయోధ్యకాండలోని శ్లోకాన్ని చెప్పేస్తున్నాడు. అంతేకాదు రామాయణ క్విజ్ లో విజేతలుగా నిలిచారు. ఈ ముస్లిం యువకులు కేరళకు చెందినవారు కావడం విశేషం. వివరాల్లోకి వెళ్తే..

రామాయణంలో తనకు ఇష్టమైన శ్లోకం గురించి ఎవరైనా మహమ్మద్ బాసిత్ ని అడిగితే.. ఆ ముస్లిం యువకుడు రెండవ ఆలోచన లేకుండా “అయోధ్య కాండ” నుండి పద్యాలనూ చకచకా చదివేస్తాడు. లక్ష్మణుడి కోపాన్ని.. నివారించడం కోసం అన్న శ్రీరాముడు తన సోదరుడికి రాజ్యం విలువల గురించి తెలియజేస్తూ.. ఓదార్పును చెప్పే పద్యాలను చెబుతాడు. మలయాళంలో రచించిన ‘ఆధ్యాత్మ రామాయణం’ లోని శ్లోకాలను అందరికీ అర్ధమయ్యేలా సరళంగా వివరిస్తాడు. ఆ పద్యాల అర్ధాన్ని.. అందులోని సందేశాన్ని అందరికీ వివరిస్తాడు.

రామాయణ ఇతిహాసంలో లోతైన జ్ఞానాన్ని అందరికీ అందించేలా మహమ్మద్ బాసిత్ తన కాలేజీ సహచరుడు మిత్రుడు మహమ్మద్ జబీర్ తో కలిసి ప్రయత్నాలు చేస్తున్నాడు. అంతేకాదు ఇటీవల ఆన్‌లైన్‌లో నిర్వహించిన రామాయణ క్విజ్ పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచారు.

ఇవి కూడా చదవండి

ఉత్తర కేరళ జిల్లాలోని వాలంచేరిలో ఉన్న KKSM ఇస్లామిక్, ఆర్ట్స్ కాలేజీలో ఎనిమిదేళ్ల కోర్సు..  వాఫీ ప్రోగ్రామ్‌లో స్టూడెంట్స్ బాసిత్ , జబీర్ లు .. వీరు ఐదవ, చివరి సంవత్సరం చదువుతున్నారు. గత నెలలో జరిగిన క్విజ్‌లో ఐదుగురు విజేతల్లో వీరు ఇద్దరు ఉన్నారు. ‘రామాయణ మాసం’. రామాయణం క్విజ్‌లో ఇస్లామిక్ కళాశాల విద్యార్థులు సాధించిన విజయం మీడియా దృష్టిని ఆకర్షించింది. దీంతో ఈ ఇద్దరు ముస్లిం స్టూడెంట్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తమ చిన్నప్పటి నుంచి రామాయణ ఇతిహాసం గురించి తెలిసినా.. అన్ని ప్రధాన మతాల బోధనలతో కూడిన వాఫీ కోర్సులో చేరిన తర్వాత రామాయణాన్ని లోతుగా చదవడం ప్రారంభించామని.. హిందూమతం గురించి తెలుసుకోవడం ప్రారంభించామని విద్యార్థులు తెలిపారు.

కాలేజీలోని విశాలమైన కళాశాల లైబ్రరీ, ఇతర మతాలకు సంబంధించిన పుస్తకాల సేకరణ, పురాణాలను చదవడానికి , అర్థం చేసుకోవడానికి స్టూడెంట్స్ కు సహాయపడింది. “భారతీయులందరూ రామాయణం, మహాభారత ఇతిహాసాలను దేశ సంస్కృతి, సంప్రదయం , చరిత్రలో భాగమైనందున వాటిని చదవాలి .. ఇతిహాసాల నుంచి నేర్చుకోవాలని తెలిపారు. ఈ గ్రంథాలను నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం మన బాధ్యత అని తాను నమ్ముతున్నాను” అని జబీర్  చెప్పారు.శ్రీరాముడు ధర్మానికి, సహనానికి, ప్రశాంతతకు స్వరూపుడని, ఇలాంటి ఉదాత్తమైన సద్గుణాలు ప్రతి మనిషిలో ఉండాలని వాఫీ విద్యార్థి అన్నారు.

“రాముడు తన తండ్రి దశరథుడికి ఇచ్చిన మాట కోసం తన రాజ్యాన్ని కూడా త్యాగం చేశాడు.. నేడు అధికారం కోసం అంతులేని పోరాటం చేస్తున్న కాలంలో జీవిస్తున్నామని తెలిపారు. మనం రాముడి వంటి పాత్రల నుండి ,రామాయణం వంటి ఇతిహాసాల సందేశం నుండి ప్రేరణ పొందాలి” అని  బాసిత్ , జబీర్ లు వివరించారు. ఏ మతం ద్వేషాన్ని ప్రోత్సహించదు… శాంతి, సామరస్యాన్ని మాత్రమే బోధిస్తుందని చెప్పారు. క్విజ్ గెలవడం తమకు ఇతిహాసాన్ని మరింత లోతుగా నేర్చుకునేందుకు మరింత ప్రేరణనిచ్చిందని బాసిత్ , జబీర్ లు చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..