Mumbai: అర్ధరాత్రి కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం.. ఒకరు మృతి.. శిథిలాల కింద 25 మంది..!

|

Jun 28, 2022 | 8:33 AM

భవనం కూలిన సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు.

Mumbai: అర్ధరాత్రి కుప్పకూలిన నాలుగు అంతస్థుల భవనం.. ఒకరు మృతి.. శిథిలాల కింద 25 మంది..!
Mumbai Building Collapses
Follow us on

Mumbai building collapses: మహారాష్ట్ర రాజధాని ముంబై నాయక్‌నగర్‌లో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందిని రెస్క్యూ చేసి కాపాడినట్లు అధికారులు తెలిపారు. భవనం కూలిన సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని కాపాడారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న 8మందిని రక్షించారు. ఆ తర్వాత వారిని ఆసుపత్రికి తరలించామని.. ప్రస్తుతం చికిత్స అందుతుందని అధికారులు తెలిపారు. అయితే, శిథిలాల కింద 20 నుంచి 25 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో భవనం కుప్పకూలగా వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు బీఎంసీ అధికారులు, ఎన్‌డిఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఆశిష్ కుమార్ పేర్కొన్నారు.

సమచారం అందుకున్న మంత్రి ఆదిత్య థాకరే వెంటనే.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేస్తే.. వెంటనే శిథిలావస్థ భవనాలు ఖాళీ చేయాలని సూచించారు. లేదంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి శిథిలావస్థ భవనాల కూల్చివేతలను పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని.. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆధిక్య థాక్రే అధికారులకు ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..