Mumbai: రోడ్డు ప్రమాదాలు జరిగినట్లే అగ్ని ప్రమాదాలు చాలా పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో దేశంలో చాలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోగా, ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. ఇక తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంఖుర్ద్ ప్రాంతంలోని స్క్రాప్‌యార్డ్‌లో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంఖుర్ద్‌లో ఉన్నస్క్రాప్‌యార్డ్‌లో అకస్మా్త్తుగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శాఖ ఆరు ఫైర్ ఇంజన్లను ఘటనా స్థలానికి తరలించింది.
కాగా, ఇప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఇక అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ముంబైలో ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షార్ట్‌సర్య్కూట్ కారణంగా, ఇతర కారణాలతో జరిగిన అగ్ని ప్రమాదాలతో భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది.
Maharashtra: Fire breaks out at a scrapyard in Mankhurd area of Mumbai; six fire engines pressed into action
— ANI (@ANI) September 16, 2021