Political News: ఇన్నాళ్లు ఓ ఆఫీసర్‌ను టార్గెట్‌ చేసిన మంత్రివర్యులు.. ఇప్పుడు ఆయనే టార్గెట్‌గా మారారు.

|

Nov 30, 2021 | 6:51 AM

Political News: మహారాష్ట్ర పాలిటిక్స్‌లో హాట్‌ పొలిటీషియన్‌గా మారారు నవాబ్ మాలిక్. ఇన్నాళ్లు ఓ ఆఫీసర్‌ను టార్గెట్‌ చేసిన మాలిక్, ఇప్పుడు ఆయనే టార్గెట్‌గా మారారు.

Political News: ఇన్నాళ్లు ఓ ఆఫీసర్‌ను టార్గెట్‌ చేసిన మంత్రివర్యులు.. ఇప్పుడు ఆయనే టార్గెట్‌గా మారారు.
Nawab Malik
Follow us on

Political News: మహారాష్ట్ర పాలిటిక్స్‌లో హాట్‌ పొలిటీషియన్‌గా మారారు నవాబ్ మాలిక్. ఇన్నాళ్లు ఓ ఆఫీసర్‌ను టార్గెట్‌ చేసిన మాలిక్, ఇప్పుడు ఆయనే టార్గెట్‌గా మారారు. వివరాల్లోకెళితే.. మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ మీద రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా పడింది. ముంబై డిస్ట్రిక్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్.. ఆ మంత్రి మీద పరువునష్టం దావా వేసింది. దీనికి సంబంధించి ఆయన సమాధానం ఇచ్చేందుకు బాంబే హైకోర్టు ఆరు వారాల గడువు విధించింది. నవాబ్ మాలిక్ తో పాటు మరో ఏడుగురి మీద ఈ పరువు నష్టం దావా వేసింది బ్యాంక్. జూలై 1 నుంచి జూలై 4 మధ్య తమ బ్యాంకుకు సంబంధించి అభ్యంతరకరంగా, అవమానిస్తూ ముంబై మహానగరంలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని, వాటిని కొన్ని లక్షల మంది చూశారని, దాని వల్ల తమ బ్యాంకు పరువుకు భంగం వాటిల్లిందంటూ ఆ బ్యాంకు తరఫున వాదనలు వినిపించారు న్యాయవాది అఖిలేష్ చౌబే. తమ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు నవాబ్ మాలిక్ తో పాటు మరో ఏడుగురికి కూడా తమ బ్యాంకు తరఫున నోటీసులు పంపినట్టు కోర్టుకు తెలిపారు న్యాయవాది.

బ్యాంకు ఇచ్చిన నోటీసులను విత్ డ్రా చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాను బహిరంగ క్షమాపణ చెప్పబోనని మాలిక్ తమకు చెప్పినట్టు కోర్టుకు విన్నవించారు అఖిలేష్. ఈ ఇష్యూ బ్యాంకు ఉన్నతిని, గౌరవాన్ని దెబ్బతీస్తోందని, బ్యాంకు రెప్యుటేషన్ మీద ఇది ప్రభావం చూపుతుందని కోర్టుకు విన్నవించారు లాయర్. ప్రజల ముందు తమ బ్యాంకు పరువును మసకబారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు. బ్యాంకు తరఫు న్యాయవాదుల వాదనలకు నవాబ్ మాలిక్ తరఫు నుంచి సమాధానం ఇచ్చారు లాయర్. నవాబ్ మాలిక్ కానీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆ హోర్డింగ్‌లు, పోస్టర్లతో ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. కావాలనే ఈ బ్యాంకు వాళ్లు తన క్లయింట్‌ను వివాదంలోకి లాగాలని చూస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రతివాదనలు చేశారు నవాబ్ మాలిక్ తరఫు న్యాయవాదులు.

Also read:

Gold Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన పసిడి ధర.. 10 గ్రాములపై ఎంత తగ్గిందంటే..

Twitter Gets New CEO – Parag Agrawal: భార‌తీయుడికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా పరాగ్ అగర్వాల్ బాధ్యతలు..

Health Tips: రోజూ ఇలా బ్రెష్ చేయకుంటే గుండె జబ్బులు తప్పవు.. తాజా పరిశోధనల్లో సంచలనాలు..