లిరిసిస్ట్ జావేద్ అఖ్తర్ వేసిన పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు హాజరు కాని పక్షంలో అరెస్టు వారంట్ జారీ చేస్తామని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ని ముంబై కోర్టు హెచ్చరించింది. ఆమెకు తాము చివరి అవకాశం ఇస్తున్నామని అంధేరీ లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు పేర్కొంది. అయితే కంగనా ప్రసుతం దేశంలో లేరని, విదేశాల్లో ఉన్నారని, అందువల్ల వ్యక్తిగతంగా ఆమె కోర్టుకు హాజరు ల]=కాలేరని ఆమె తరఫు లాయర్ తెలిపారు. వ్యక్తిగత హాజరీ నుంచి తన క్లయింటును మినహాయించాలని ఆయన కోరారు. నిజానికి ఆమె ఈరోజు కోర్టకు హాజరు కావలసి ఉంది. కానీ ఆమెకి ఇలా మినహాయింపు ఇవ్వరాదని, ఏ తేదీన విచారణకు రావాలని ఉత్తర్వులు ఇచ్చినా ఆమె రావడం లేదని జావేద్ అక్తర్ తరఫు అడ్వొకేట్ అన్నారు. ఇలా మినహాయింపులు ఇవ్వడం చాలా సార్లు జరిగిందన్నారు. ఏమైనా ఈ పాండమిక్ సమయంలో ఈ రోజుకు కంగనాకు మినహాయింపు ఇస్తున్నామని మెజిస్రేట్ ఆర్.ఆర్ ఖాన్ తెలిపారు.
కాగా ఈ కేసు చాలా రోజులుగా కొనసాగుతోంది. బాలీవుడ్ సూసైడ్ గ్యాంగ్ లో జావేద్ అక్తర్ భాగమని, ఎలాగైనా అయన తప్పించుకుని పోతారంటూ కంగనా లోగడ ఓ ఇంటర్వ్యూలో ఆరోపించింది. ఇది నాడు నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ చేసుకున్నప్పటి మాట.. అయితే ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో జావేద్ ఈమెపై పరువు నష్టం దావా వేశారు. అయితే దీన్ని మొదట ఆమె సవాలు చేస్తూ స్థానిక కోర్టు కెక్కింది. ఆ కోర్టు కొట్టి వేయడంతో బాంబే హైకోర్టుకెక్కింది.
మరిన్ని ఇక్కడ చూడండి : చిరంజీవి, ఎన్టీఆర్ చెప్పారని 4ఏళ్లు.. నేర్చుకున్నా..! యువహీరో తో ఇంట్రస్టింగ్ ఇంటర్వ్యూ:Hero Teja Sajja video.
ఈ టీవీ ధర వింటే…మూర్ఛపోవడం ఖాయం..సరికొత్త టెక్నాలజీ రూపొందించిన శాంసంగ్:Samsung The Wall Video
మంచుకొండల్లో చిక్కుకున్న యంగ్ హీరో.. అడ్వంచరస్ టూర్‌లో బిజీ బిజీ..: Navdeep Video.