AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి.. టీబీఎం కట్టర్ హెడ్ అమరిక సక్సెస్.. మిక్స్ షీల్డ్ టెక్నాలజీతో..

దేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ముంబయి-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ముంబైలోని 21 కిలోమీటర్ల పొడవైన సముద్ర సొరంగ నిర్మాణంలో రెండో భారీ టీబీఎం కట్టర్ హెడ్ అమరిక విజయవంతంగా పూర్తయింది. దేశంలోనే అతిపెద్ద 13.6 మీటర్ల వ్యాసం గల టన్నెల్‌లో అప్, డౌన్ లైన్లు నిర్మించనున్నారు.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక మైలురాయి.. టీబీఎం కట్టర్ హెడ్ అమరిక సక్సెస్.. మిక్స్ షీల్డ్ టెక్నాలజీతో..
Bullet Train
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2026 | 7:20 AM

Share

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. ముంబయి, అహ్మదాబాద్‌ హై-స్పీడ్ కారిడార్ నిర్మాణంలో వేగం మరింత పెరిగింది. ముంబైలో ఇప్పటికే ఒకవైపు టన్నెల్ పూర్తవ్వగా.. తాజాగా రెండోవైపు టీబీఎం కట్టర్ హెడ్ అమరిక విజయవంతంగా పూర్తయింది. సావ్లీ షాఫ్ట్‌లో 350 టన్నుల భారీ కట్టర్ హెడ్ ఏర్పాటు పూర్తి చేశారు. 21 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం కోసం భారీ యంత్రాలు రంగంలోకి దిగాయి. 13.6 మీటర్ల వ్యాసంతో దేశంలోనే అతిపెద్ద సొరంగం నిర్మించబోతున్నారు. ఒకే టన్నెల్‌లో అప్ అండ్ డౌన్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. జులై మొదటి వారంలో సొరంగ తవ్వకం పనులు ప్రారంభం కానున్నాయి. రెండవ టీబీఎం ప్రయాణం విక్రోలి వైపు సాగనుంది. దీంతో రెండు వైపుల నుంచి వేగవంతంగా పనులు జరగనున్నాయి. మిక్స్ షీల్డ్ టెక్నాలజీతో అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చారు. సురక్షితమైన సొరంగ నిర్మాణమే లక్ష్యమన్నారు హైస్పీడ్ రైల్ కారిడార్ అధికారులు. నిమిషానికి 49 మిల్లీ మీటర్ల వేగంతో TBM తవ్వకం జరపనుంది. రికార్డు స్థాయిలో పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పర్యావరణానికి నష్టం కలగకుండా సముద్ర మట్టం కంటే లోతులో సొరంగ మార్గ నిర్మాణం ఉంటుంది.

ముంబయి, అహ్మదాబాద్‌లను అనుసంధానించేలా చేపట్టిన 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 8 పర్వత సొరంగాలు ఉండగా, వాటిలో 7 మహారాష్ట్రలోనే ఉన్నాయి. దేశంలో మొదటి బుల్లెట్ రైలును నడపడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన అన్ని పనులు వేగంగా పూర్తవుతున్నాయి.

బుల్లెట్ రైలు కోసం వందల కిలోమీటర్ల ట్రాక్ పూర్తవుతుండగా.. ఈ రైలు ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్, శిల్‌ఫాటా మధ్య ఒక పొడవైన సొరంగం నుంచి వెళ్తుంది. 21 కిలోమీటర్ల పొడవైన సముద్రపు టన్నెల్‌లో ఇప్పటికే ఒక భాగం నిర్మాణం పూర్తయింది. రెండో భాగం పనులు జులై నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
పచ్చిమిర్చిని తక్కువ అంచనా వేయకండి!ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఈ టీచర్ మామూలోడు కాదు.. చిట్టీల పేరుతో కోట్లు వసూల్.. కట్ చేస్తే
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
ఆయనతో ఉన్న అనుబంధం ఎప్పటికీ మర్చిపోలేను..
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
పాకిస్థాన్ క్రికెట్‌కు వరుస షాకులు.. ఏకంగా రూ.25 కోట్ల భారీ నష్టం
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఆర్డర్ లేట్‌గా తెచ్చాడని.. డెలివరీ బాయ్‌పై భార్యభర్తల దాడి..
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఐదే ఎపిసోడ్స్.. థ్రిల్ నెక్ట్స్ లెవెల్.. OTTలో ఈ సిరీస్ చూశారా?
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
ఆ పాత్రను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోను
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
పెళ్లి ఆలస్యమవుతోందా..? మంగళ దోషం ప్రభావం కావచ్చు.. ఈ పరిహారాలతో
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ధర మారదు.. బరువు పెరగదు.. పార్లే-జి వేల కోట్ల లాభాల వెనుకున్న..
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం
ప్రియురాలితో దొరికిపోయిన భర్త..భార్యను కారుతో ఈడ్చుకెళ్లిన దారుణం