రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ..తన రికార్డును తానే బ్రేక్ చేశారు. ఇటీవల దుబాయ్‌లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేసిన ఈ బిలియనీర్..లేటెస్ట్‌గా మరో బీచ్ సైడ్ విల్లాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్‌లోని పామ్ జుమైరాలో ఉన్న లగ్జరీయస్ విల్లాను తన చిన్నా కుమారుడు అనంత్ అంబానీ కోసం కొనుగోలు చేసినట్టు సమాచారం. సుమారు 163 మిలియన్ డాలర్ల విలువైన..అంటే రూ.1353 కోట్లు వెచ్చించి ఈ విల్లాను కొన్నట్టు తెలుస్తోంది. చెట్టు ఆకారంలో ఉండే ఈ పామ్ జుమైరా.. దుబాయిలో కృతిమంగా ఏర్పాటుచేసిన దీవుల సముదాయం. కువైట్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయా కుటుంబానికి చెందిన విల్లానే..అంబానీ తన సొంతం చేసుకున్నట్లు సమాచారం.
గతవారంలో 163 మిలియన్ డాలర్ల ప్రాపర్టీ డీల్ జరిగినట్టు రికార్డ్ చేసిన దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్..ఎవరు కొనుగోలు చేశారో మాత్రం వెల్లడించలేదు. తమ వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించే యోచనలో ఉన్న అంబానీ ఇటీవల విదేశాల్లో ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. గత నెలలో 640 కోట్లకు పైగా విలువజేసే బిల్డింగ్ కొనుగోలు చేసిన అంబానీ..దాన్ని పెద్ద కుమారుడు ఆకాశ్‌కు కేటాయించినట్టు సమాచారం. 79 మిలియన్ల డాలర్లతో ఐకానిక్ యూకే కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్‌ను రూ.592 కోట్లతో కొనుగోలు చేశారు. అలాగే కుమార్తె ఈశా అంబానీ కోసం న్యూయార్క్‌లో కూడా ఖరీదైన భవనం కోసం వెతుకుతున్నారని..అలాగే సింగపూర్ ఫ్యామిలీ ఆఫీస్ ఏర్పాటులో బిజీగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..