MUDA-Valmiki Scam: నెక్స్ట్ సీఎం ఎవరు..? సిద్ధరామయ్యను చుట్టుముట్టిన ముడా, వాల్మీకి స్కామ్‌.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..

|

Aug 25, 2024 | 8:38 PM

కర్ణాటక కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్‌లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా వాల్మీకి స్కామ్‌ ఇటు తెలంగాణ, అటు కర్ణాటక కాంగ్రెస్‌ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.

MUDA-Valmiki Scam: నెక్స్ట్ సీఎం ఎవరు..? సిద్ధరామయ్యను చుట్టుముట్టిన ముడా, వాల్మీకి స్కామ్‌.. కాంగ్రెస్ రియాక్షన్ ఇదే..
Karnataka Congress
Follow us on

కర్ణాటక కాంగ్రెస్‌లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వరుసగా కేసుల్లో కూరుకుపోతున్నారు. ముడా, వాల్మీకి స్కామ్‌లు ఆయన ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు తెచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా వాల్మీకి స్కామ్‌ ఇటు తెలంగాణ, అటు కర్ణాటక కాంగ్రెస్‌ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. కర్నాటక ప్రభుత్వ అకౌంట్ల నుంచి రూ.180 కోట్లు దారిమళ్లాయని సీఎం సిద్ధరామయ్య ఒప్పుకున్నారు. తెలంగాణలోని 9 అకౌంట్లకు రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని.. స్కామ్‌పై విచారణ ప్రారంభించగానే వాల్మీకి కార్పొరేషన్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారని.. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని ఈడీ అరెస్ట్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు.. లోక్‌సభ ఎన్నికల్లో వాల్మీకి స్కామ్‌ డబ్బులనే తెలంగాణ కాంగ్రెస్ ఖర్చు చేసినట్టు అనిపిస్తోందని.. ఈ స్కామ్‌ విషయం బయటకు రాకుండా సీఎం రేవంత్‌ వ్యవస్థలను మేనేజ్‌ చేస్తున్నారని.. వాల్మీకి స్కామ్‌పై రాహుల్ గాంంధీ నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

సీఎం సిద్దరామయ్య వరుస కేసుల్లో చిక్కుకోవడంతో సీఎం పదవిపై కన్నేసిన నేతలు కుర్చీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సిన లేదా దింపేయాల్సిన పరిస్థితి వస్తే.. సీఎం కుర్చీని ఎవరికి అప్పగించాలనే దానిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్లాన్‌ బీ సిద్ధం చేస్తునట్టు తెలుస్తోంది. సిద్ధరామయ్యకు తమ మద్దతు ఉంటుందని చెప్తూనే పార్టీ హైకమాండ్ ప్రత్యామ్నాయ ప్రణాళికను రచిస్తోంది. ఈ విషయం పై చర్చించేందుకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ. కే శివకుమార్‌, కర్ణాటక ఇన్‌ఛార్జ్‌ రణదీప్‌ సుర్జేవాలాతో సమావేశమయ్యారు. సీఎం ను మార్చాలా? వద్దా ఒకవేళ మార్చాల్సి వస్తే ఎవరైతే ప్రభత్వాన్ని సమర్థవంతంగా నడపగరనే అంశాలపై చర్చించారు.

రొటేషనల్ ముఖ్యమంత్రి ఫార్ములా” ఆధారంగా ఒక రాజీ కుదిరిందని, దాని ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్ సీఎం అవుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఈ విషయాన్ని పార్టీ ఎప్పుడూ అధికారికంగా ధృవీకరించలేదు. తాజాగా కాంగ్రెస్‌లో సీఎం మార్పు పరిణామాలపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం మ్యూజికల్‌ చైర్స్‌ ఆట మొదలయ్యిందని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.

అయితే, తాజాగా కర్ణాటక సీఎం మార్పు పై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని..సీఎంగా సిద్దరామయ్య కొనసాగుతారని.. ఇదంతా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రచారమేనని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి