సినిమా నిర్మాణం కోసం మేకలను దొంగలించిన హీరోలు

సినిమా తీయాలన్నది తండ్రి కోరిక.. అందులో హీరోలుగా నటించి పాపులరవ్వాలని కొడుకుల ముచ్చట! ఆ ముచ్చట తీర్చుకోవడం కోసం హీరోలు మేకల దొంగలయ్యారు.. చివరకు పట్టుబడ్డారు.. ఇంట్రో అర్థం కాలేదు కదు! ఇప్పుడు అసలు కథలోకి వెళదాం!

సినిమా నిర్మాణం కోసం మేకలను దొంగలించిన హీరోలు
Follow us

|

Updated on: Nov 11, 2020 | 1:54 PM

సినిమా తీయాలన్నది తండ్రి కోరిక.. అందులో హీరోలుగా నటించి పాపులరవ్వాలని కొడుకుల ముచ్చట! ఆ ముచ్చట తీర్చుకోవడం కోసం హీరోలు మేకల దొంగలయ్యారు.. చివరకు పట్టుబడ్డారు.. ఇంట్రో అర్థం కాలేదు కదు! ఇప్పుడు అసలు కథలోకి వెళదాం! తమిళనాడులోని న్యూ వాషర్‌మెన్‌పేటకు చెందిన విజయ్‌శంకర్‌ అనే వ్యక్తికి సినిమా తీయాలన్న కోరిక బలంగా ఉండింది.. ఉన్న కాసింత డబ్బును పెట్టుబడిగా పెట్టి నీదాన్‌ రాజా అన్న టైటిల్‌తో ఓ కామెడీ మూవీని ప్రారంభించాడు.. ఇందులో హీరోలుగా అతడి కుమారులు నిరంజన్‌, లెనిన్‌లు నటిస్తున్నారు.. సినిమా తీయడమంటే మాటలు కాదుగా! చేతిలో ఉన్న డబ్బులన్నీ కరిగిపోయాయి కానీ సినిమా మాత్రం పూర్తికాలేదు.. సగంలోనే ఆగిపోయింది.. హీరోలుగా నటిస్తున్న నిరంజన్‌, లెనిన్‌లు ఎలాగైనా సరే సినిమాను కంప్లీట్‌ చేయాలనుకున్నారు. ఇందుకోసం మూడేళ్ల నుంచి మేకలను దొంగలిస్తున్నారు.. వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో షూటింగ్‌ కానిచ్చేస్తున్నారు. తమిళనాడులోని చెంగల్‌పేట, మాధవరం, మింజూర్‌, పొన్నేరిలో మేకల పెంపకం ఎక్కువ.. అక్కడికి ఈ ఇద్దరు అన్నదమ్ములు వెళుతూ మంద నుంచి రోజుకు ఎనిమిది నుంచి పది మేకలను ఎత్తుకొచ్చేస్తున్నారు.. ఒక్కో మేకను ఎనిమిది వేల రూపాయలకు అమ్ముతున్నారు. ఈ దొంగతనాలకు ఎప్పుడో ఒకప్పుడు బ్రేక్‌ పడాలి కదా! ఆ రోజు రానే వచ్చింది.. మాధవరంలోని ఓ వ్యక్తి ఇంటి దగ్గర ఉన్న ఆరు మేకలలో ఒక మేకను అన్నదమ్ములు ఎత్తుకెళ్లారు.. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లాడు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని అక్కడున్న సీసీ కెమెరాలను పరిశీలించారు.. ఓ కారులో వచ్చిన అన్నదమ్ములు మేకను ఎత్తుకెళుతున్నట్టు కెమెరాలో స్పష్టంగా కనిపించింది.. కారు ఆధారంతో వారిద్దరిని పట్టుకున్నారు పోలీసులు.. అలా ఆ కామెడీ సినిమా మళ్లీ ఆగిపోయింది..

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు