Monkey Fever: అక్కడ కలకలం రేపుతోన్న మంకీ ఫీవర్‌.. భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలు..

|

May 06, 2022 | 1:35 PM

ఓవైపు తగ్గిపోయిందనుకున్న కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ కోరలు చాస్తోంది. మరోవైపు కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా విజృంభిస్తోంది. ఈక్రమంలో కర్ణాటక (Karnatka) లో అరుదైన మంకీఫీవర్‌ (Monkey Fever) కలకలం రేపుతోంది.

Monkey Fever: అక్కడ కలకలం రేపుతోన్న మంకీ ఫీవర్‌.. భయంతో ఆస్పత్రులకు పరుగులు తీస్తున్న ప్రజలు..
Follow us on

ఓవైపు తగ్గిపోయిందనుకున్న కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ కోరలు చాస్తోంది. మరోవైపు కేరళలో షిగెల్లా బ్యాక్టీరియా విజృంభిస్తోంది. ఈక్రమంలో కర్ణాటక (Karnatka) లో అరుదైన మంకీఫీవర్‌ (Monkey Fever) కలకలం రేపుతోంది. గత నెలలో సిద్ధాపుర్​ తాలుకాలో మంకీ ఫీవర్​సోకి 85 ఏళ్ల ఓ మహిళ మృత్యువాత పడింది. తాజాగా శివమొగ్గ జిల్లా తాలుకా అరళగోడ్​కు రామస్వామి కరమానే (55) కూడా ఈ ఫీవర్‌తోనే మృతి చెందారు. వీరితో పాటు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో శివమొగ్గ జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరీక్షల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. కాగా శివమొగ్గ జిల్లాలోని సాగర్​, హోసనగర్​, తీర్థనహళ్లి ప్రాంతాలు మంకీ ఫీవర్​ హాట్ స్పాట్లుగా మారాయి. ఇక్కడి ప్రజలు స్వల్ప జ్వరం వచ్చినా వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. వైద్యులు కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపించినవారందరికీ వెంటనే రక్త పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్​ వచ్చిన వారికి మందులు రాసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కాగా మంకీఫీవర్‌ బాధితుల కోసం శివమొగ్గలోని మేఘన్​ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశారు. తీవ్రంగా ప్రభావితమైన వారిని మణిపాల్​ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభం నుంచి..

కాగా 2022 ప్రారంభం నుంచి కర్ణాటకలో మంకీ ఫీవర్​ వేగంగా వ్యాప్తి చెందుతోందని అధికారులు చెబుతున్నారు. జనవరి నుంచి ఏప్రిల్​ మధ్యలో మొత్తం 42 కేసులు నమోదైనట్లు వారు పేర్కొన్నారు. తీర్థనహళ్లి-29, సాగర్​-04, సిద్ధాపుర్​-09 చొప్పున పాజిటివ్​ కేసులు నమోదయ్యాయని, అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పుకొచ్చారు. కాగా మంకీ ఫీవర్‌ నే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) అని కూడా పిలుస్తారు. ఇది టిక్- బర్న్ వైరల్ హెమరేజిక్ వ్యాధి. ఇది మానవులకు, కోతులకు ప్రాణాంతకం. ఈ వ్యాధి పేను జాతుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా హేమోఫిసాలిస్ స్పినిగెరా(నల్లులు, గోమార్లు) ఈ వ్యాధిలో ప్రధాన వాహకాలుగా ఉండగా.. చిన్న చిన్న ఎలుకలు, కోతులు, పక్షుల ద్వారా మనుషులకు సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. KFD మొదటిసారిగా 1957లో భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని క్యాసనూర్ ఫారెస్ట్‌లో బయటపడింది. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాప్తి చెంది. 2012 నుంచి ప్రతి సంవత్సరం 500 లకు పైగా మంకీ ఫీవర్ కేసులు నమోదవుతున్నాయి. KFD ద్వారా ప్రభావితమైన వారిలో 5 నుంచి 10% మంది బాధితులు రక్తస్రావ లక్షణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఐదేళ్లలో ఈ వ్యాధి కారణంగా కనీసం 340 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: 

Manju Warrier: స్టార్‌ హీరోయిన్‌పై డైరెక్టర్ వేధింపులు.. మఫ్టీలో వెళ్లి అరెస్ట్‌ చేసిన పోలీసులు..

Coronavirus: దేశంలో మళ్లీ కోరలు చాస్తోన్న కరోనా.. మహారాష్ట్రలోనూ పెరుగుతున్న బాధితులు.. నిన్న మొత్తం ఎన్ని కేసులంటే..

Edible Oils: గుడ్‌న్యూస్‌.. దిగిరానున్న వంట నూనెల ధరలు.. కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం..