
పోల్ గ్రౌండ్‌లో ఓడిపోతామన్న భయంలేదు. రాజకీయ యుద్ధం వస్తే తానే ముందంటూ పరుగులు పెడతారు. ఎవరి లెక్కలు వేసినా వారి సమీకరణం వారిదే..ఎవరు ఏ స్ట్రాటజీ వేసినా చెదరని మెజారిటీ ఆయనదే. ఆయన పేరు ప్రజల నినాదాల్లో మార్మోగుతున్నప్పుడు ప్రత్యర్థుల వెన్నులో వణుకు కూడా ఒక్కటే . అసెంబ్లీ నుంచి లోక్‌సభ వరకూ.ప్రతి ఎన్నిక, ప్రతి యుద్ధం చెబుతున్న మాట ఒకటే..“లెక్కలు వేరైనా… లెజెండ్ ఒక్కరే . ఆయనే ప్రధాని మోదీ. బీహార్ విజయం..చిన్న కథ కాదు. పార్టీలు మారాయి…ప్రచార శైలులు మారాయి… కానీ మోదీపై ఉన్న ఓటరు నమ్మకం మాత్రం తగ్గలేదు. ఓటు బ్యాంకులు కదిలాయి. కూటములు మారాయి…కథానాయకులు మారారు..కానీ విక్టరీ తర్వాత వినిపించిన పేరు ఒక్కటే..అదే మోదీ. బీహార్ గల్లీలో వీచిన మోదీ గాలి.. జాతీయ రాజకీయాల్లో తుఫానులా మారబోతోందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇది కేవలం ఒక పార్టీ విజయం కాదు.. స్ట్రాటజీ ఎలా ఉండాలి, ప్రచారం ఎలా నడపాలి, నాయకత్వం ఎలా పని చేయాలి. అన్నదానికి మోదీ మరోసారి ఒక నమూనా చూపించాడు. బీహార్ అంటే సాధారణ ఓటరున్న రాష్ట్రం కాదు. నరనరాన కులం తాలూకూ భావజాలం నిండిన రాజ్యం. అనేక సంఘటనలతో కూడిన చరితం. సమీకరణాలు ఎటు కదిలినా ఫలితాలు మరోలా వచ్చే నేల.అలాంటి నేలపై మరోసారి మోదీ మ్యాజిక్ చూపారు. మోదీ ప్రచారశైలి మొత్తం ఒక సందేశం చుట్టూనే తిరిగింది. ప్రతి సభలో ‘వికసిత్ బీహార్’ను...