మోదీ ‘ఇడ్లీలు’..తమిళనాట సరికొత్త ప్రచారం

| Edited By: Anil kumar poka

Sep 01, 2020 | 11:08 AM

తమిళనాడులోని సేలం జిల్లాలో ప్రధాని మోదీ పేరిట  ఇడ్లీలను తయారు చేసి హోటళ్లలో అమ్మే సరికొత్త ప్రచారాన్ని అక్కడి బీజేపీ శాఖ చేపడుతోంది. 'మోదీ ఇడ్లీస్, 10 రూపాయలకు నాలుగు' అంటూ...

మోదీ ఇడ్లీలు..తమిళనాట సరికొత్త ప్రచారం
Follow us on

తమిళనాడులోని సేలం జిల్లాలో ప్రధాని మోదీ పేరిట  ఇడ్లీలను తయారు చేసి హోటళ్లలో అమ్మే సరికొత్త ప్రచారాన్ని అక్కడి బీజేపీ శాఖ చేపడుతోంది. ‘మోదీ ఇడ్లీస్, 10 రూపాయలకు నాలుగు’ అంటూ అక్కడి కమలం పార్టీ నేత మహేష్ ఇందుకు శ్రీకారం చుట్టారు. తమ జిల్లాలోనే కాక, రాష్ట్రమంతటా మోదీ ప్రభంజనం వీచాలన్నదే తమ ఉద్దేశమని ఆయన అన్నారు. తమిళంలో ఇలా మోదీ ఇడ్లీస్’ అంటూ రాయించి అప్పుడే పోస్టర్ ను హోటళ్లపై ఏర్పాటు చేశాడాయన. ప్రస్తుతం 22 చిన్నపాటి హోటళ్లలో వీటిని వినియోగదారులకు అందించే ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచుతామని ఆయన చెప్పారు. ఈ సరికొత్త ప్రచారం తన పలుకుబడి పెరగడానికి కూడా దోహదపడుతుందని ఆయన ఆశిస్తున్నాడు.