Kishan Reddy: ఈశాన్య భారత దేశం (North East Region)లో శాంతి, అభివృద్ధి మొదలైందని, ప్రధాని నరేంద్ర మోడీ నవ భారత నిర్మాణ అజెండాలో ఈశాన్య భారత అభివృద్ధికి పెద్దపీట వేశారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈశాన్య భారత అభివృద్ధిపై ఎగువ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా కిషన్ రెడ్డి పలు విషయాలను వెల్లడించారు.
ఈ సందర్బంగా రాజ్య సభలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగానే ఆ ప్రాంతంలో శాంతితో కూడిన సుస్థిరమైన వాతావరణం ఏర్పటుకు కేంద్రం కృషి చేసింది. ఈ ప్రాంతంలో రైలు, రోడ్డు, విమాన మార్గాలతో పాటు, నీరు, టెలికాం సదుపాయల కోసం కేంద్రం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. ఈశాన్య భారతంలో పెట్టుబడులు రావడానికి, ఆర్థిక అభివృద్ధికి కేంద్రం తీసుకున్న ఈ చర్యలు ఉపయోగపడతాయి. 2014-2021 వరకు ఒక్క రైల్వే కోసమే రూ. 39,000 కోట్లు కేటాయించాము. ఈశాన్య భారత ప్రాంతంలో కేంద్ర మంత్రులు తరుచూ సందర్శించడం ద్వారా ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను పటిష్టంగా అమలకు మార్గం సుగుమమం అవుతుంద’ని మంత్రి అభిపాయప్రడ్డారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈశాన్య భారతంలో అల్లర్లు కూడా ఘణనీయంగా తగ్గాయని కిషన్ రెడ్డి తెలిపారు. 2014తో పోలిస్తే 2020 నాటికి ఈ సంఖ్య చాలా వరకు తగ్గాయన్నారు. అలాగే ఈ ప్రాంతాల్లో సామాన్య ప్రజలు, సెక్యూరిటీ అధికారుల మరణాలు కూడా తగ్గిపోయాయని మంత్రి తెలిపారు. తిరుగుబాటు దారులతో శాంతి చర్చలు జరపడం, వారికి పునరావాస కల్పన కోసం భారీ మొత్తంలో ప్రత్యేక గ్రాంట్స్ ఇచ్చామని కిషన్ రెడ్డి వివరించారు. ఇక ఈశాన్య భారత రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపుల్లోనూ అగ్ర స్థానం కల్పించామని తెలిపిన మంత్రి. 2014లో రూ. 36,108 కోట్లు ఉన్న బడ్జెట్‌ను 2022-23 నాటికి ఏకంగా రూ. 76,040 కోట్లకు పెంచామని చెప్పుకొచ్చారు.
The @narendramodi Government has always given importance to agriculture in the #NER.
Giving impetus to producing edible oil in India, Central Govt is giving incentives to our Annadatas!
53% of the total sanction under National Edible Oil Mission has been allocated to NER. pic.twitter.com/pSoh8kAJ0J
— G Kishan Reddy (@kishanreddybjp) March 15, 2022
అంతేకాకుండా ఈశాన్య భారతంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా ఉండడానికి విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం రూ. 10,000 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. నేషనల్ వాటర్ వే-2లో భాగంగా ఈశాన్య భారతానికి నీటి కొరత తీర్చేందుకు నీటి ప్రాజెక్టులు చేపట్టామన్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో ఆరోగ్యానికి 2014 తర్వాత రూ. 25,589 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈశాన్య భారత అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ ఏకతాటిపైకి రావాలని, ఈశాన్య భారతం అభివృద్ధి చెందనంత వరకు భారత్ అభివృద్ధి చెందలేదని కిషన్ రెడ్డి పిలుపినిచ్చారు.
స్కైడైవింగ్ చేయాలనుకుంటున్నారా ? అయితే మన దేశంలో ఉన్న అందమైన ప్రదేశాలు ఇవే..