Mizoram Election: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోలేకపోయిన ముఖ్యమంత్రి.. ఎందుకో తెలుసా..?
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఓటే వేసేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని పరిణామం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో మిజోరం సీఎం జోరంతంగా ఓటు వేయలేకపోయారు.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే ఓటే వేసేందుకు వచ్చిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊహించని పరిణామం ఎదురైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం పనిచేయకపోవడంతో మిజోరం సీఎం జోరంతంగా ఓటు వేయలేకపోయారు. మిజోరాంలో 40 మంది సభ్యుల అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 7 గంటలకు, గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది.
ఓటు వేసే సమయంలో ఈవీఎం యంత్రం పనిచేయలేదన్నారు సీఎం జోరంతంగా. ఈవీఎం ద్వారా ఓటు వేయడానికి ప్రయత్నించారు. కానీ యంత్రం మొరాయించింది. తిరిగి వచ్చి ఓటు వేస్తానని వెళ్ళిపోయారు సీఎం జోరంతంగా. మిజోరంలో హంగ్ అసెంబ్లీ ఏర్పాటు అయ్యే అవకాశముందని, తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. దానిపై పూర్తి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.
#WATCH | Mizoram elections | CM and MNF president Zoramthanga could not cast a vote; he says, "Because the machine was not working. I was waiting for some time. But since the machine could not work I said that I will visit my constituency and vote after the morning meal." https://t.co/ytRdh7OpKe pic.twitter.com/ogGoQu0Sdn
— ANI (@ANI) November 7, 2023
174 మంది అభ్యర్థుల ఎన్నికల భవితవ్యాన్ని నిర్ణయించడానికి మిజోరంలో దాదాపు 8.57 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో దాదాపు 4.39 లక్షల మంది మహిళల ఓటర్లు ఉన్నారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), ప్రధాన ప్రతిపక్షం జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM), కాంగ్రెస్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. బీజేపీ 23 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్థులను ప్రతిపాదించింది. వీరితో పాటు 27 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.
మిజోరం అంతటా ఉన్న 1,276 పోలింగ్ స్టేషన్‌లలో 149 రిమోట్ ఓటింగ్ కేంద్రాలు, అంతర్ రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఉన్న 30 కీలకమైనవిగా ప్రకటించింది ఎన్నికల సంఘం. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 7,200 మంది సిబ్బందితో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల పోలింగ్‌కు ముందు మయన్మార్‌తో 510 కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దు, బంగ్లాదేశ్‌తో 318 కిలోమీటర్ల సరిహద్దును మూసివేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…