Chhattisgarh Mizoram Election 2023: సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్.. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్ ప్రారంభం..
Mizoram - Chhattisgarh Assembly Elections : సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ అని చెప్పుకునే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకేవిడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని 20 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలివిడత సమరానికి అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీసు యంత్రాగం పకడ్భందిగా చర్యలు తీసుకున్నాయి.
Mizoram – Chhattisgarh Assembly Elections : సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ అని చెప్పుకునే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా.. రెండు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మిజోరాంలో మొత్తం 40 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒకేవిడతలో పోలింగ్ జరుగుతోంది. ఇక ఛత్తీస్‌గఢ్‌లోని 20 నియోజకవర్గాలకు తొలి విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. తొలివిడత సమరానికి అటు ఎన్నికల సంఘం, ఇటు పోలీసు యంత్రాగం పకడ్భందిగా చర్యలు తీసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల బీజేపీ నేతను నక్సల్స్ హత్యచేయడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో..
చత్తీస్‌ఘడ్‌లో తొలిదశ పోలింగ్ జరుగుతున్న 20 స్థానాల్లో 12 స్థానాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బస్తర్‌లోనే 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు.. ఈ ప్రాంతంలోనే 60 వేల మంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దించారు. మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ హెచ్చరికల కారణంగా డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఎన్నికల వీడియో చూడండి..
ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశలో 25 మంది మహిళలు సహా 223 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారి రాజకీయ భవితవ్యాన్ని 40,78,681 మంది ఓటర్లు నిర్ణయించనున్నారు. 19,93,937 మంది పురుషులు, 20,84,675 మంది మహిళలు, 69 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. కాగా.. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది.
మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలు.. 600 కేంద్రాలు సమస్యాత్మకం
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన బస్తర్ డివిజన్‌లో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మొత్తం 5304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 600 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. దీంతో నిఘాను పటిష్ఠం చేసిన అధికారులు.. అక్కడ మూడంచెల భద్రతను అమలు చేస్తున్నారు. మావోయిస్టుల ఏరివేత కోసం ప్రత్యేకంగా పనిచేసే కోబ్రా యూనిట్, మహిళా కమాండోలు కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. 156 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందితోపాటు ఈవీఎంలను హెలికాప్టర్ ద్వారా తరలించారు. బస్తర్‌లోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి 3గంటల వరకు పోలింగ్ జరగనుండగా.. మిగతా మూడు స్థానాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
మిజోరంలో..
#WATCH | Chief Minister of Mizoram Zoramthanga casts his vote for the Mizoram Assembly Elections 2023 at 19-Aizawl Venglai-I YMA Hall polling station under Aizawl North-II assembly constituency. pic.twitter.com/w3MdGFLWme
— ANI (@ANI) November 7, 2023
మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. మిజోరంలో మొత్తం ఓటర్ల సంఖ్య 8,51,895.. వీరిలో 4,12,969 మంది పురుషులు, 4,38,925 మంది మహిళలు, 1 థర్డ్ జెండర్ ఉన్నారు. ఎన్నికల బరిలో మొత్తం 174 మంది ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..