
అమెరికా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి అనే సాకు చూపించి భారతదేశంపై 50 శాతం సుంకం విధించింది. అమెరికాతో సంబంధాలు క్షీణించాయి. ఈ చర్యలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పెరిగింది. సంబంధాలను దెబ్బతీసింది. భారతదేశం రష్యాతో చమురు వ్యాపారం చేస్తోందని చెబుతూ అమెరికా అదనంగా 25 శాతం సుంకం విధించింది. భారత్ చమురు దిగుమతిని చేసుకోకుండా ఆపాలని అమెరికా కోరుకుంది. తర్వాత భారత్ పై మరింత ఒత్తిడిని సృష్టించడానికి అదనపు సుంకం విధించింది. ఆగష్టు 27 నుంచి ఈ అదనపు సుంకాలు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ SCO శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి చైనాలో అడుగు పెట్టారు. జి జిన్‌పింగ్, వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరినీ మోడీ కలిశారు. ఈ సమావేశం జరుగుతున్న సమయంలోనే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన ఒక పెద్ద ప్రకటన వెలుగులోకి వచ్చింది.
భారతదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో చేసిన ప్రకటనను పంచుకుంది. ఇది అమెరికా, భారతదేశం మధ్య భాగస్వామ్యం కొత్త శిఖరాలను తాకుతూనే ఉందని పేర్కొంది. ఇది 21వ శతాబ్దపు నిర్వచించే సంబంధం.. ఈ నెలలో మనం మనల్ని ముందుకు నడిపించే పురోగతి, అవకాశాల గురించి చర్చిస్తున్నాము. ఆవిష్కరణ, వ్యవస్థాపకత నుంచి రక్షణ, ద్వైపాక్షిక సంబంధాల వరకు, మన రెండు దేశాల ప్రజల మధ్య శాశ్వత స్నేహమే ఈ ప్రయాణానికి శక్తినిస్తుందని అన్నారు. దీనితో పాటు, #USIndiaFWDforOurPeopleలో( యుఎస్-ఇండియా ఫార్వర్డ్ ఫర్ అవర్ పీపుల్) భాగం కావాలని పిలుపునిచ్చింది.
The partnership between the United States and India continues to reach new heights — a defining relationship of the 21st century. This month, we’re spotlighting the people, progress, and possibilities driving us forward. From innovation and entrepreneurship to defense and… pic.twitter.com/tjd1tgxNXi
— U.S. Embassy India (@USAndIndia) September 1, 2025
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ , రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలిశారు. ముగ్గురూ నవ్వుకుంటూ, జోక్ చేసుకుంటున్న గడిపిన సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి ఈ ప్రకటన చేయడం విశేషం. . అదే సమయంలో చాలా మంది అమెరికా అధికారులు భారతదేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ,వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. ట్రంప్ స్వయంగా ప్రధానమంత్రిని ప్రశంసిస్తూ భారతదేశంపై 50 శాతం సుంకం విధించడాన్ని కూడా సమర్థిస్తున్నారు.
మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..