G20 Summit: జీ 20 సమావేశాలతో పర్యాటక రంగం పరుగులు.. TV9 నెట్‌వర్క్ సమ్మిట్‌లో టూరిజం సెక్రెటరీ అరవింద్‌ సింగ్‌

|

Mar 25, 2023 | 8:49 AM

G20 శిఖరాగ్ర సమావేశాలతో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించనుందని టూరిజం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్‌ పేర్కొన్నారు. TV9 నెట్‌వర్క్ ట్రావెల్ అండ్ టూరిజం సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన 2023ని విజిట్‌ ఇండియా ఇయర్‌గా అభివర్ణించారు.

G20 Summit: జీ 20 సమావేశాలతో పర్యాటక రంగం పరుగులు.. TV9 నెట్‌వర్క్ సమ్మిట్‌లో టూరిజం సెక్రెటరీ అరవింద్‌ సింగ్‌
G20 Summit 2023
Follow us on

కోవిడ్-19 కారణంగా గత కొన్నేళ్లలో భారత పర్యాటక రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ ఈ నష్టం నుంచి కోలుకుంటోంది. ముఖ్యంగా గతేడాది భారత టూరిజం రంగంలో గణనీయమైన వృద్ధి కనిపించింది. ఇక G20 శిఖరాగ్ర సమావేశాలతో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభించనుందని టూరిజం మంత్రిత్వ శాఖ కార్యదర్శి అరవింద్ సింగ్‌ పేర్కొన్నారు. TV9 నెట్‌వర్క్ ట్రావెల్ అండ్ టూరిజం సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన 2023ని విజిట్‌ ఇండియా ఇయర్‌గా అభివర్ణించారు. ‘అంతర్జాతీయ పర్యాటకం 2021 గణాంకాలతో పోలిస్తే 2022లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. దేశీయ పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి కనిపించింది. మెట్రో నగరాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వారంతాల్లో ఈ ప్రదేశాలు ఎక్కువగా రద్దీగా కనిపిస్తున్నాయి. పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాలప్రకారం, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలలో జమ్మూకశ్మీర్‌ ను అత్యధిక మంది టూరిస్టులు సందర్శించారు. ఇక ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలో పర్యాటకుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2019లో వారణాసిని 70 నుంచి 80 లక్షల మంది దర్శించుకోగా, 2022లో ఆ సంఖ్య ఏడు కోట్లు దాటింది. దేశీయ పర్యాటక రంగంలో ఈ రకమైన వృద్ధి ఎంతో సంతోషకరం’ అని రెడ్‌హాట్ కమ్యూనికేషన్స్‌తో కలిసి TV9 గ్రూప్ హోస్ట్ చేసిన కార్యక్రమంలో సింగ్ పేర్కొన్నారు.

ఆదాయంతో పాటు అభివృద్ధి..

ఈ పరిణామాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, ఇన్‌బౌండ్ టూరిస్ట్‌లకు ప్రీ-కోవిడ్ స్థాయిలు ఇంకా సాధించాల్సి ఉందని అరవింద్ సింగ్‌ అంగీకరించారు. G20 శిఖరాగ్ర సమావేశాలు పర్యాటక రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పేర్కొన్నారు. ‘ G20 శిఖరాగ్ర సమావేశాల కోసం భారత టూరిజం మరో మెట్టు పైకెక్కుతుంది. ఇప్పటివరకు ఏ దేశానికీ 55 స్థానాల్లో G20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం రాలేదు. దేశంలోని 55-ప్లస్ ప్రదేశాలలో అంతర్జాతీయ స్థాయి సమావేశాలు నిర్వహించగల సామర్థ్యం భారతదేశానికి ఉందని దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లకు ఇది సందేశాన్ని పంపుతుంది. ప్రతి G20 సమావేశంలో దాదాపు 200 మంది వ్యక్తులు ఉంటారు. తగినన్ని హోటల్ వసతి, అవసరమైన సమావేశ సౌకర్యాలు, మంచి కనెక్టివిటీ మొదలైన అంశాల ఆధారంగా ఈ వేదికలను ఎంపిక చేశారు. గుజరాత్‌లోని రాన్ ఆఫ్ కచ్ ఎడారిలో ఉన్న గ్రామం వంటి కొన్ని సుదూర ప్రదేశాలలో కూడా సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి, ఈ ప్రాంతాలకు కూడా అభివృద్ధి చెందనున్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ధోలావిరాలో ఒక ముఖ్యమైన రహదారి ప్రాజెక్ట్ పెండింగ్‌లో ఉంది. G20 ఈవెంట్ ఉంది కాబట్టి ఇది సమయానికి పూర్తయింది హైవేలు, రైల్వేలు, విమానాశ్రయాల ద్వారా ఇప్పుడు అనేక కొత్త గమ్యస్థానాలు అనుసంధానమయ్యాయి. ఇది ప్రధాన భూభాగం నుండి ఈశాన్య రాష్ట్రాలకు కనెక్టివిటీని మరింత సులభతరం చేసింది. ఇప్పుడు ప్రైవేట్‌ రంగం కూడా ఈశాన్య ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది ప్రోత్సాహకరమైన సంకేతం’ అని సింగ్‌ వివరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి