AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జయలలిత ఫొటోతో అసెంబ్లీలో ప్రమాణం చేసిన విజయ్ పార్టీ ఎమ్మెల్యే.. అసలు విషయం ఏంటంటే..?

తమిళనాడులో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఒక ఎమ్మెల్యే ప్రమాణం మాత్రం అందరినీ ఆకర్షించింది. మంత్రి సెంగోట్టయ్యన్.. తన జేబులో జయలలిత ఫోటోతో ప్రమాణం చేయడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే నుంచి టీవీకేలో చేరిన ఆయన.. తన రాజకీయ గురువును గుర్తుచేసుకుంటూ ప్రమాణం చేశారు.

జయలలిత ఫొటోతో అసెంబ్లీలో ప్రమాణం చేసిన విజయ్ పార్టీ ఎమ్మెల్యే.. అసలు విషయం ఏంటంటే..?
Minister Sengottaiyan Carried Jayalalitha Photo In His Pocket
Krishna S
|

Updated on: May 11, 2026 | 1:44 PM

Share

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరింది. ఆదివారం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇవాళ కొత్తగా ఎన్నికైన సభ్యులంతా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. పెరంబూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్, సభలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అయితే ఈ వేడుకలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం సీనియర్ నేత కె.ఎ.సెంగోట్టయ్యన్ వైఖరి. గోపిచెట్టిపాలయం ఎమ్మెల్యేగా 11వ సారి ఎన్నికైన ఆయన, ప్రమాణం చేసే సమయంలో తన చొక్కా జేబులో మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఫోటోను ఉంచుకున్నారు. ఏఐఏడీఎంకేలో దశాబ్దాల పాటు కీలక నేతగా ఉన్న సెంగోట్టయ్యన్, ఎడప్పాడి పళనిస్వామితో విభేదించి ఎన్నికలకు ముందు టీవీకేలో చేరారు. పార్టీ మారినా, తన రాజకీయ గురువు జయలలితపై ఉన్న భక్తిని చాటుకుంటూ ఆయన ఫోటోతో ప్రమాణం చేయడం సభలో ఆసక్తికరంగా మారింది.

విజయ్ టీమ్‌లో పెద్దన్న

తమిళనాడు రాజకీయాల్లో సెంగోట్టయ్యన్ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆయన గోపిచెట్టిపాలయం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడం ఇది 11వ సారి. అన్నాడీఎంకేలో మంత్రిగా పనిచేసిన ఆయన అనుభవాన్ని గుర్తించిన విజయ్, టీవీకేలో కార్యవర్గ కమిటీ ముఖ్య సమన్వయకర్త పదవిని ఇవ్వడమే కాకుండా కొత్త ప్రభుత్వంలోనూ మంత్రి పదవి కట్టబెట్టారు. ఆయనను ఈరోడ్ జిల్లా పార్టీ కార్యదర్శిగా నియమించి, పశ్చిమ తమిళనాడులో పార్టీ బలోపేతానికి విజయ్ పెద్ద పీట వేశారు.

తొలిరోజే మూడు ఫైళ్లపై..

ఇక తొలిరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తనదైన మార్కు పాలనను ప్రారంభించారు. మూడు కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు.

ఉచిత విద్యుత్: 500 యూనిట్ల లోపు వాడే వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.

మహిళా రక్షణ: రాష్ట్రవ్యాప్తంగా మహిళల రక్షణ కోసం సింగ పెణ్ ప్రత్యేక దళం ఏర్పాటు.

డ్రగ్స్ రహిత రాష్ట్రం: మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.

ప్రతిపక్షంలో ఉదయనిధి స్టాలిన్

ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో సహచరులుగా ఉన్న విజయ్, ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు అసెంబ్లీలో ముఖాముఖి తలపడనున్నారు. డీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన ఉదయనిధి స్టాలిన్, ప్రతిపక్ష నేత వ్యవహరించనున్నారు.

Follow Us