G20 Digital Economy Ministers meeting: ఆ మూడు ప్రాధాన్యతలు ఎంతో ముఖ్యం.. జీ20 సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు

కర్ణాటక రాజధాని బెంగళూరులో జీ 20 డిజిటల్ ఎకానని మంత్రుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగించారు. డిజిటల్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ కోసం భారత్ ఎంపిక చేసిన ప్రాధాన్యతల గురించి ఆయన వివరించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నిర్వచించే సమస్యల గురించి చర్చించేందుకు తాము సమావేశమైనట్లు పేర్కొన్నారు. టెక్ రంగంలో ప్రపంచంలోని అత్యంత మార్గదర్శక కంపెనీలలో చాలా వరకు బెంగళూరులోనే ఉన్నాయని తెలిపారు.

G20 Digital Economy Ministers meeting: ఆ మూడు ప్రాధాన్యతలు ఎంతో ముఖ్యం.. జీ20 సమావేశంలో అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
Minister Ashwini Vaishnaw

Updated on: Aug 19, 2023 | 10:55 PM

కర్ణాటక రాజధాని బెంగళూరులో జీ 20 డిజిటల్ ఎకానని మంత్రుల సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగించారు. డిజిటల్ డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ కోసం భారత్ ఎంపిక చేసిన ప్రాధాన్యతల గురించి ఆయన వివరించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిని నిర్వచించే సమస్యల గురించి చర్చించేందుకు తాము సమావేశమైనట్లు పేర్కొన్నారు. టెక్ రంగంలో ప్రపంచంలోని అత్యంత మార్గదర్శక కంపెనీలలో చాలా వరకు బెంగళూరులోనే ఉన్నాయని తెలిపారు. దేశంలో బెంగళూరు ఆవిష్కరణకు కేంద్రంగా మారిందన్నారు. డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ కోసం ఇండియన్ ప్రెసిడెన్సీ ఎంపిక చేసిన మూడు ప్రాధాన్యాతల గురించి ఆయన మాట్లాడారు. అవి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI), డిజిటల్ ఎకానమీలో భద్రత, డిజిటల్ స్కేలింగ్ అని తెలిపారు. ఈ మూడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. G20 డిజిటల్ ఎకానమీ మంత్రుల సమావేశం ఆయా దేశాలు పరస్పరం సహకరించుకోవడానికి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై సలహాలు, సూచనలను పంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన వేదికను అందిస్తుందని తెలిపారు.

ఇది ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ తీరును రూపొందిస్తుందని మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. మానవాళి అందరికీ ప్రయోజనం చేకూర్చే సాంకేతికతతో నడిచే భవిష్యత్తు గురించి ప్రధాని మోడీ దృష్టికి దోహదం చేస్తుందన్నారు. దేశంలో దాదాపు 40 కోట్ల మంది బ్యాంకు సేవలను పొందుతున్నారని తెలిపారు. జీ – 20 సమావేశంలో పాల్గొన్న ప్రతిఒక్కరు ఈ విషయాన్ని అభినందించారని అన్నారు. భారత్‌లోని డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఉపయోగించడం ఎంత సులభమో మంత్రులు దాన్ని అనుభవించారని తెలిపారు. అందుకే గ్లోబల్ సౌత్ మరియు ఇతర దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడానికి DPI నిర్మాణాన్ని అనుసరించాలని ఏకాభిప్రాయం ఉందని తెలిపారు. ఈ
మూడు రంగాలకు సంబంధించి మేము మంచి ఏకాభిప్రాయాన్ని పొందామని.. మొత్తంగా ఈ G20 మంత్రుల సమావేశం ఒక ఫలిత పత్రాన్ని ఆమోదించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది జీ – 20 సమావేశానికి బ్రెజిల్ అధ్యక్షత వహించనుంది. అలాగే భారత్ అధ్యక్షతన జరిగనటువంటి పనులను బ్రెజిల్ ముందుకు తీసుకెళ్లనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..