Asaduddin Owaisi: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఏ క్షణమైనా భారత్-చైనా మధ్య యుద్ధం జరుగొచ్చంటూ ఒవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా బుల్డోజర్లతో చొరబడిందన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఏం చేస్తోందన్నారు శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. అరుణాచల్‌లో చైనా బుల్డోజర్లతో విరుచుకుపడుతుంటే కేంద్ర సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. దీనిపై పార్లమెంట్ అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించాలన్నారు. చైనా విషయంలో బీజేపీ సర్కార్ ఎందుకు మౌనంగా ఉందో అర్ధం కావడంలేదన్నారు ఓవైసీ. ఇదే సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారిపట్ల బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు ఒవైసీ. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారిని సస్పెండ్ చేశామనడం కంటితుడుపు చర్యే అని విమర్శించారు. సస్పెన్షన్ పేరుతో బీజేపీ నాటకాలాడుతోందని ధ్వజమెత్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..