Miracle: అరుదైన ఘటన.. వేప చెట్టు నుంచి కారుతోన్న పాలు.. తాగితే రోగాలన్నీ మాయం.?
వేప చెట్టు నుంచి పాల పొంగు.. అమ్మవారి మహిమేనంటూ జనం ఉప్పొంగిపోతున్నారు. భక్తిభావంతో పూజలు చేస్తున్నారు.
వేప చెట్టు నుంచి పాల పొంగు.. అమ్మవారి మహిమేనంటూ జనం ఉప్పొంగిపోతున్నారు. వాటిని తాగితే రోగాలు మాయమవుతాయని అంటున్నారు. భక్తిభావంతో కాలినడకన వెళ్లి కొబ్బరికాయ, పూజా సామాగ్రితో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ జిల్లా నిగాహిలో చోటుచేసుకుందీ ఆశ్చర్యకర ఘటన. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని సింగరౌలీ జిల్లా నిగాహి గ్రామంలో శనివారం ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ఓ వేపచెట్టు నుంచి పాలు ద్రవం రూపంలో కారడం మొదలయ్యాయి. అది చూసి భక్తులు ఇది షీత్లా మాత మహిమేనని చెబుతున్నారు. ఈ వేప చెట్టుకు చాలా సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నామని.. ఆ పాలు తాగితే రోగాలన్నీ మాయమవుతాయని అంటున్నారు.
మరోవైపు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయన్న విషయం ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు పాకింది. దీంతో దాన్ని చూసేందుకు వందలాది మంది భక్తులకు అక్కడికి చేరుకొని.. పూజలు చేస్తున్నారు. ఈ వేప చెట్టు కింద ఇలాంటి అద్భుతాలు ఇదివరకే చాలా జరిగాయని స్థానికులు తెలిపారు. కాగా, వేప చెట్టు నుంచి పాల లాంటి ద్రవం కారడానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణమంటున్నారు వృక్ష శాస్త్ర నిపుణులు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా చెట్టు కాండంపై పగుళ్లతో పాటు పాల లాంటి ద్రవం వస్తుందంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..